అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘కస్టడీ’(Custody). ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా సినిమాపై ఆసక్తిని పెంచేలా ఓ అప్డేట్ అందింది.
అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) సాలిడ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన నటించిన చివరి రెండు చిత్రాలు డిజాస్టర్ కావడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత శ్రద్ధ వహిస్తున్నారు. 2022లో వచ్చిన ‘బంగార్రాజు’ మంచి ఫలితాన్నే ఇచ్చింది. కానీ ఆ తర్వాత థియేటర్లలో దిగిన ‘థ్యాంక్యూ’,‘లాల్ సింగ్ చద్దా’ మాత్రం ఆశించిన ఫలితాలివ్వలేకపోయింది. ఇక ఎలాగైన హిట్ కొట్టాలనే తప్పన అక్కినేని హీరో మరింతగా కనిపిస్తోంది. దీంతో అప్ కమింగ్ ఫిల్మ్ కోసం మరింత కష్టపడుతున్నారు. అటు మేకర్స్ కూడా ఎక్కడా రాజీపడటం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు ఆకట్టుకోగా.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా అందింది.
ప్రముఖ తమళ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్ లో చైతన్య నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘కస్టడీ’ (Custody). వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ‘మానాడు’ చిత్రం హిట్ కొట్టడంతో చైతూ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ కూడా దక్కింది. ఇక తాజాగా మరో క్రేజీ అప్డేట్ అందింది. ప్రస్తుతం గ్రాండ్ విజువల్స్ తో మేకర్స్ ఓ సాంగ్ ను షూట్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం భారీ మొత్తంలోనే ఖర్చు చేస్తున్నారంట.
హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈసాంగ్ షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయంట. ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఈ ఒక్క పాటకోసమే.. స్టూడియోలో ఏకంగా ఏడు సెట్స్ వేయించబోతున్నట్టు తెలుస్తోంది. చాలా గ్రాండ్ గా, విజువల్ పరంగా మంచి అవుట్ పుట్ కోసం సెటింగ్స్ వేయిస్తున్నారని తెలుస్తోంది. దీంతో సినిమాను ఏ రేంజ్ లో నిర్మిస్తున్నారన్నది అర్థం అవుతోంది. అవుట్ పుట్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా.. చాలా శ్రద్ధగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నాగచైతన్య తొలిసారిగా ఖాకీ దుస్తుల్లో అలరించబోతున్నారు. గతంలో వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’లో డీసీపీ ర్యాంక్ అధికారిగా కనిపించారు. ‘లాల్ సింగ్ చడ్డా’లో ఆర్మీ అవతారంలో ఆకట్టుకున్నారు.
వెంకట్ ప్రభు గతంలో యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలనే తెరకెక్కించడంతో ఈ చిత్రం కూడా అదే జోనర్ లో ఉంటుందని అంటున్నారు. నాగచైతన్య సరసన మరోసారి కృతి శెట్టి (Krithi Shetty) ఆడిపాడుతోంది. ప్రియమణి, అరవింద్ స్వామి, శరత్‌కుమార్, సంపత్ రాజ్, ప్రేమి విశ్వనాథ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మే12న విడుదల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.