యాంకర్ విష్ణు ప్రియా (Vishnu Priya) తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తల్లి చూపిన ప్రేమ, జ్ఞాపకాలు మదిలో పదిలంగా దాచుకున్నానంటూ ఓ వీడియో పంచుకుంటూ భావోద్వేగమయ్యారు.
యాంకర్ గా విష్ణు ప్రియా బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆయా షోలతో అలరించడంతో పాటు సోషల్ మీడియాలోనూ విష్ణు ప్రియా ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా వాళ్ల అమ్మను గుర్తుచేసుకుంటూ విష్ణుప్రియా భావోద్వేగమన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ పోస్ట్ తో అందరి మనస్సులను కదిలించారు.
గతనెల 27న (జనవరి 2023) విష్ణు ప్రియా తల్లి తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె కన్నీమున్నీరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న యాంకర్లు, బుల్లితెర నటీనటులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు బుల్లితెర స్టార్స్ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. కాగా, ఫిబ్రవరి 15న విష్ణుప్రియా మదర్ పుట్టిన రోజు. దీంతో తన తల్లికి విష్ చేసేందుకు ఓ భావోద్వేగమైన నోట్ ను పోస్ట్ చేసింది. తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు విష్ణుప్రియా. ఈ సందర్భంగా తల్లిపైన ప్రేమను నోట్ ద్వారా వెల్లడించారు.
‘అమ్మ పుట్టినరోజు నీకు శుభాకాంక్షలు.. మీ ప్రేమను, మీరు అందించిన శక్తిని ఎవరూ.. ఏదీ కూడా భర్తీ చేయలేదు. నువ్వు నా ఏంజెల్. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. నువ్వంటే చెప్పలేనంత ప్రేమ ఉంది. ఐలవ్ యూ అమ్మ’.. అంటూ భావోద్వేగమయ్యారు. ఈ సందర్బంగా తన తల్లితో ప్రేమగా ఉన్న ఓ వీడియోను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విష్ణుప్రియ ఫ్యాన్స్ ఆమెకు దైర్యం చెబుతున్నారు.