రోజూ బిర్యానీ తినలేం కదా.. ? తమిళ స్టార్ హీరో జయం రవి కామెంట్స్ వైరల్

Published : May 02, 2023, 12:15 PM ISTUpdated : May 02, 2023, 12:19 PM IST
రోజూ బిర్యానీ తినలేం కదా.. ? తమిళ స్టార్ హీరో జయం రవి కామెంట్స్  వైరల్

సారాంశం

భారీ బడ్జెట్ సినిమాల గురించి, స్టార్ హీరోల ఇమేజ్ గురించి జయం రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంత పెద్ద సినిమాలో నటించారు కదా.. నెక్ట్స్ సినిమల పరిస్థితి ఏంటీ అని అడిగితే.. డిఫరెంట్ గా సమాధానం చెప్పారు జయం రవి. 

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన సినిమా పొన్నియిన్ సెల్వన్. రెండు భాగాలుగా రూపొందిన ఈమూవీ ఫస్ట్ పార్ట్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వగా.. సెకండ్ పార్ట్ మూవీ తాజాగారిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను సాధించింది. రిలీజ్ రోజు నుంచే పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతున్న ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ సాధించింది.  ఇక ఈసినిమాలో అద్భుతమైన పాత్రలో నటించి మెప్పించారు తమిళ హీరో జయం రవి...ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

ఓ సందర్భంలో  జయం రవి మాట్లాడుతూ..  పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలు ఐదేళ్ల శ్రమ అని ఆయన అన్నారు. ఈ సినిమా కోసం ప్రముఖ నటీనటులతో నటించడం సంతోషంగా ఉందని జయం రవి చెప్పుకొచ్చారు. షూటింగ్ టైమ్ లో సందడి వాతావరణం ఉండేదని.. ఎన్నోవిషయాలు తమ దగ్గర చర్చకు వచ్చేయవని ఆయన వెల్లడించారు. ఇంత పెద్ద సినిమాలో.. ఇంత మంది స్టార్స్ కలిసి నటించడం.. మళ్ళీ సాధ్యమయ్యే విషయం అవుతుందో కాదో తెలియదన్నారు.  వే

ఇక ఇదే సందర్భంగా రవికి ఓ ప్రశ్న ఎదురయ్యింది. ఇలాభారీ సినిమాలలో నటించిన తర్వాత మీరు నటించే చిన్న బడ్జెట్ సినిమాలు మీ ఫ్యాన్స్ చూస్తారా అని ప్రశ్నించగా..? జయం రవి మాట్లాడుతూ..  రోజూ బిర్యానీ తినలేం కదా అని ఆయన అన్నారు. సాంబార్ అన్నం తినక తప్పదు అని ఆయన కామెంట్ చేశారు. అలాగే చేసినప్పుడల్లా.. పెద్ద సినిమాలు చేయలేం కదా.. చిన్న సినిమాలు కూడా అలరిస్తాయి.. అవి కూడా చూడాలి తప్పదు అన్నారు. 

పొన్నియిన్ సెల్వన్ తరహా సినిమాలు అరుదుగా మాత్రమే వస్తాయని  అన్నారు రవి. తన తరువాతి సినిమాల విషయంలో తనకు భయం లేదన్నారు జయం రవి. తాను వాటి ఫలలితాల విషయంలో ఏమాత్రం టెన్షన్ పడటంలేదన్నారు.  తాను నటించిన ఇరైవన్ సినిమా త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉందని జయం రవి కామెంట్లు చేశారు. సైరన్ అనే మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నానని జయం రవి చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల పాత్రల్లో కనిపిస్తానని తండ్రి రోల్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తానని జయం రవి చెప్పారు. 

ఇక తను త్వరలో డైరెక్టర్ గా మారబోతున్నట్టు వెల్లడించారు రవి. తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో కార్తీ హీరోగా నటిస్తారని జయం రవి చెప్పారు. తాను ప్రస్తుతం చిన్నచిన్న కథలను తయారు చేసుకుంటూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నానని అన్నారు రవి. పొన్నియిన్ సెల్వన్ మూవీలో రవి పాత్ర బాగా వర్కౌట్ అయ్యింది. ఆయన హ్యాండ్సమ్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్