అక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akhil) ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన లేటెస్ట్ ఫిల్మ్ ‘ఏంజెట్’పై ఆశలు పెట్టుకున్నారు. చిత్రం నుంచి వరుస అప్డేట్స్ అందుతుండగా.. యూనిట్ తాజాగా క్రేజీ అనౌన్స్ మెంట్ ఇచ్చింది.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ - ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏజెంట్’ (Agent). స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి యూనిట్ వరుసగా అప్డేట్స్ అయితే అందిస్తున్నారు. వరుస ఫ్లాప్ లతో ఉన్న అఖిల్ కు చివరిగా ‘మోస్ట్ ఎలిబుల్ బ్యాచిలర్’తో డీసెంట్ హిట్ దక్కింది. కానీ అక్కినేని హీరో గురిమాత్రం సాలిడ్ హిట్ పై పడింది. ప్రస్తుతం విడుదలకు సిద్ధం అవుతున్న ‘ఏజెంట్’పైనే ఆశలు పెట్టుకున్నారు.
అయితే, ఈ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ విడుదలవుతున్న అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈరోజు మహా శివరాత్రి సందర్భంగా యూనిట్ ఆడియెన్స్ కు, అక్కినేని ఫ్యాన్స్ కు శుభాకాంక్షలు తెలుపుతూ అదిరిపోయే పోస్టర్ ను వదిలారు. దాంతోపాటు క్రేజీ అప్డేట్ కూడా అందించారు. త్వరలోనే చిత్రం నుంచి మరో అప్డేట్ రాబోతుంది.. ఈసారి మ్యూజిక్ బ్లాస్ రాబోతుందని అనౌన్స్ చేశారు. మొత్తానికి ‘ఏజెంట్’ ఫస్ట్ సింగిల్ సిద్ధం అయినట్టు తెలుస్తోంది. దీంతో అఖిల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ కు మంచి రెస్పాన్సే దక్కింది. యాక్షన్ పరంగా అదిరిపోయే అప్డేట్స్ వదులుతున్న యూనిట్.. ఇక సాంగ్స్ తో ఏమేరకు ఆసక్తి పెంచుతారో చూడాలి. చిత్రానికి యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తుండటం మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. త్వరలో ఈ అప్డేట్ రానుంది.
చిత్రంలో అఖిల్, హీరోయిన్ సాక్షి వైద్య జంటగా నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండుగా మలయాళ స్టార్ యాక్టర్ మమ్ముట్టీ కీలక పాత్రను షోషిస్తున్న విషయం తెలిసిందే. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. తెలుగులో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళం, కన్నడలోనూ డబ్డ్ వెర్షన్ లో విడుదల కానుంది. పలు వాయిదా తర్వాత 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేశారు.
His SILENCE defines all the VIOLENCE🔥
Team wishes everyone a very Happy Mahashivaratri 🙏 with a Musical blast soon💥💥 pic.twitter.com/GLrSLGgTC6