హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘డీజే టిల్లు 2’. తాజాగా చిత్రం నుంచి ఈబ్యూటీకి సంబంధించిన స్పెషల్ పోస్టర్ విడుదలై ఆకట్టుకుంది.
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. చివరిగా ‘కార్తీకేయ2’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. రీసెంట్ గా వచ్చిన ‘18పేజెస్’తోనూ ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక అనుపమా నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ DJ Tillu Squre. అయితే, హీరోయిన్ గా తప్పుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిని కొట్టిపారేస్తూ అనుపమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘డీజే టిల్లు’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. సితారా ఎంటర్ టైన్స్ మెంట్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. తక్కువ బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా థియేట్రికల్ రెస్పాన్స్ తో పాటు.. బాక్సాఫీస్ వద్ద కూడా అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. దాదాపు రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఇంత రెస్సాన్స్ ను సొంతం చేసుకోవడంతో సీక్వెల్ ను కూడా ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
ఈ చిత్రంలో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) లీడ్ రోల్ లో నటిస్తున్నారు. సీక్వెల్ లో హీరోయిన్ గా అనుపమా పరమేశ్వర్ అలరించబోతున్నారు. దీంతో ప్రేక్షకులకు మరింతగా ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ అనుపమా పరమేశ్వరన్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఎందుకంటే.. ఈరోజు యంగ్ బ్యూటీ పుట్టిన రోజు కావడంతో బర్త్ డే విషెస్ తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అనుపమా లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
Wishing the very gorgeous, our a very happy birthday.🤩 - team ✨ pic.twitter.com/kCjtLPegij
— Sithara Entertainments (@SitharaEnts)