“ఆర్ఎక్స్ 100” డైరెక్టర్ కొత్త చిత్రం టైటిల్ ఇదే !

Published : Feb 09, 2019, 08:09 AM IST
“ఆర్ఎక్స్ 100” డైరెక్టర్ కొత్త చిత్రం టైటిల్ ఇదే !

సారాంశం

“ఆర్ఎక్స్ 100” చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి. బోల్డ్ తీసిన ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత చిత్ర దర్శకుడు, 

“ఆర్ఎక్స్ 100” చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి. బోల్డ్ తీసిన ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత చిత్ర దర్శకుడు, హీరో, హీరోయిన్స్ కు డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటికే హీరో,హీరోయిన్స్ పలు ప్రాజెక్టులలో బిజీ కాగా దర్శకుడు అజయ్ ఓ భారీ చిత్రం కమిటయ్యారు.

ఈ సినిమా విజయంతో అజయ్‌ భూపతికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. నితిన్‌,రామ్  లాంటి యంగ్‌ హీరోస్‌ అజయ్‌తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్‌ చూపించారు. కానీ ఆయన  యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా సినిమా చేయటానికి కమిటయ్యారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘మహాసముద్రం’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్‌కు జోడిగా సమంత హీరోయిన్‌ను తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

‘RX100’తో రొమాంటిక్ లవ్ స్టోరీ‌ని చూపించిన అజయ్ భూపతి ‘మహా సముద్రం’ చిత్రంలో క్రైమ్ ని  ఓ రేంజ్ లో చూపెడుతూ రూపొందిస్తారని తెలుస్తోంది. ఈ కథలోనూ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉంటుందని, అదే సినిమాని నిలబెడుతుందని నమ్మి భారీగా బడ్జెట్  పెడుతున్నారట. బెస్టాఫ్ లక్ అజయ్. 

 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు