వైరల్: యాత్ర సినిమా చూస్తూ ఏడ్చేసిన టీడీపీ నేత

Published : Feb 08, 2019, 09:01 PM IST
వైరల్: యాత్ర సినిమా చూస్తూ ఏడ్చేసిన టీడీపీ నేత

సారాంశం

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో రిలీజైన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ యాత్ర ఓ వర్గం వారిని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. వైఎస్ అభిమానులు సినిమా చూసి భావోద్వేగానికి లోనయినట్లు చెబుతున్నారు.

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో రిలీజైన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ యాత్ర ఓ వర్గం వారిని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. వైఎస్ అభిమానులు సినిమా చూసి భావోద్వేగానికి లోనయినట్లు చెబుతున్నారు. అయితే సినిమాకు ఇతర పార్టీల వర్గాల నుంచి నెగిటివ్స్ కామెంట్స్ కూడా అందుతున్నాయి. అయితే ప్రస్తుతం ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

వైఎస్ఆర్ సిపి  పేరుతో ఉన్న ట్విట్టర్ ఎకౌంట్ నుంచి వెలువడిన ఒక ట్వీట్ లో ఫోటో యాడ్ చేస్తూ తెలుగుదేశం నాయకుడు సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఇది ఎంతవరకు నిజం అనే విషయం ఎవరు పట్టించుకోవడం లేదు గాని వైఎస్ అభిమానులు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఆ సినిమా చుస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు వచ్చేస్తాయని చెబుతున్నారు. 

కడప రాయలసీమ వంటి ప్రాంతాల్లో యాత్ర సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో మంచి ఓపెనింగ్స్ అందుకుంది. మహి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వైఎస్ యాత్రను ప్రధానంగా చేసుకొని తెరకెక్కించారు.

 

PREV
click me!

Recommended Stories

పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో సేవ.. పాత్రలు కడిగిన గ్లోబల్ బ్యూటీ..