తెలుగులో ‘జయదేవ్’ చిత్రంలో నటించిన యంగ్ హీరోయిన్ తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది. పారిశ్రామిక వేత్తతో మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన పెళ్లి ఫొటోలను అభిమానులతో పంచుకుంది. జంటగా క్యూట్ గా ఉండటంతో పిక్స్ వైరల్ గా మారాయి.
యంగ్ బ్యూటీ మాళవిక రాజ్ (Malvika Raaj) ఈరోజు పెళ్లిపీటలు ఎక్కింది. హిందీ చిత్రం 'కభీ ఖుషీ కభీ ఘమ్'లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కు చిన్ననాటి పాత్ర పోషించిన నటి మాళవికా రాజ్ ఇటీవలే వివాహం చేసుకుంది ఆమె వివాహానికి సంబంధించిన ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటూ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆమె అభిమానులు, చాలా మంది ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఫొటోలు చాలా ఆసక్తికరంగా మారాయి. ట్రెడిషనల్ వేర్స్ లో నూతన జంటగా ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా మెరియడంతో ఫ్యాన్స్ తో పాటు అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. ఇక మాళవిక రాజ్ క్రీమ్ కలర్ లెహంగాలో చాలా అందమైన లుక్ తో ఆకర్షించింది. ఆమె భర్త ప్రణవ్ బగ్గా (Pranav Bagga) పారిశ్రామిక వేత్తగా తెలుస్తోంది. ఆయన కూడా ట్రెడిషనల్ వేర్ లో ఆకట్టుకున్నారు. మొత్తానికి నూతన జంటగా అద్భుతంగా మెరిసింది.
undefined
గత వారం మాళవిక తన నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ భాగస్వామితో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇక ఈరోజు పెళ్లి ఫొటోలను పంచుకుని ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. మాళవిక బాలీవుడ్ నటుడు జగదీష్ రాజ్ మనవరాలు. దీంతో బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తోంది. ‘కెప్టెన్ నవాబ్, ‘స్క్వాడ్’, తెలుగులో ‘జయదేవ్’ అనే చిత్రాల్లో నటించి అలరించింది.