నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి అంతా సిద్ధం..భారీ పాన్ ఇండియా కథతో సెన్సేషనల్ డైరెక్టర్ ఫిక్స్ ?

Published : Jul 01, 2024, 10:05 PM IST
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి అంతా సిద్ధం..భారీ పాన్ ఇండియా కథతో సెన్సేషనల్ డైరెక్టర్ ఫిక్స్ ?

సారాంశం

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం అయింది అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కొన్ని అఫీషియల్ పేజీలు కూడా అనౌన్స్ చేసేస్తున్నాయి.

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం అయింది అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కొన్ని అఫీషియల్ పేజీలు కూడా అనౌన్స్ చేసేస్తున్నాయి. చూస్తుంటే ఇదంతా నిజమే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మోక్షజ్ఞ సూపర్ స్టైలిష్ లుక్ లో ఉన్న ఒక పిక్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. 

ఈ పిక్ ని నందమూరి అభిమానులు వైరల్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. వారసుడు వస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీని చుట్టూ ఓ విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా ప్రచారం జరుగుతోంది. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 

వాళ్ళ నిరీక్షణకు తెరపడ్డట్లే అని చెప్పొచ్చేమో. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. హను మాన్ చిత్రంతో పాన్ ఇండియాని కుదిపేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ కోసం బాలయ్యకి ఒక స్టోరీ లైన్ చెప్పారట. ఇది కనుక కథగా మలిస్తే భారీ పాన్ ఇండియా చిత్రం అవుతుందని అంటున్నారు. 

ప్రశాంత్ వర్మ చెప్పిన పాయింట్ మైండ్ బ్లోయింగ్ గా ఉండడంతో బాలయ్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. బాలయ్య నుంచి అఫీషియల్ గా ప్రకటన వస్తే.. నందమూరి ఫ్యాన్స్ నిజంగానే వారసుడు వస్తున్నాడు అంటూ పండగ చేసుకోవచ్చు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhil Wife Zainab: ఆ విషయంలో భార్యపై ట్రోలింగ్, పెళ్ళికి ముందే తెలుసు అంటూ అఖిల్ షాకింగ్ కామెంట్స్
CM Vijays Wife: జననాయగన్ సినిమాకు విజయ్ భార్య సంగీత.. థియేటర్‌లో ప్రత్యక్షం.. నిజం ఇదే