రాధే శ్యామ్ కథ గురించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ప్రభాస్, పూజా ఈ మూవీలో ఎలా కలుసుకుంటారు, ప్రేమ ఎలా మొదలవుతుందనే విషయంపై కథనాలు వస్తున్నాయి. రాధే శ్యామ్ మూవీలో పూజా ఓ హాస్పిటల్ లో నర్స్ గా కనిపిస్తారట.
సాహో విడుదలైన ఏడాదిన్నర అవుతుంది. దీనితో ఫ్యాన్స్ ఆయన కొత్త సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ మొత్తం మూడు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. రాధే శ్యామ్, సలార్ లతో పాటు ఆదిపురుష్ మూవీ సెట్స్ పై ఉన్నాయి. రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకుంటున్న రాధే శ్యామ్ మూవీ జులై 31న విడుదల అవుతున్న విషయం తెలిసిందే.
దర్శకుడు రాధాకృష్ణ పీరియాడిక్, ఎమోషనల్ లవ్ డ్రామాగా రాధే శ్యామ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాధే శ్యామ్ మూవీ ప్రధాన నేపథ్యంలో ఇటలీలో జరుగుతుంది. అక్కడే ఎక్కువ భాగం షూటింగ్ జరపాల్సి ఉంది. అయితే కోవిడ్ తరువాత, సెట్స్ లోనే రాధే శ్యామ్ షూట్ అధిక భాగం చిత్రీకరించారు.
కాగా రాధే శ్యామ్ కథ గురించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ప్రభాస్, పూజా ఈ మూవీలో ఎలా కలుసుకుంటారు, ప్రేమ ఎలా మొదలవుతుందనే విషయంపై కథనాలు వస్తున్నాయి. రాధే శ్యామ్ మూవీలో పూజా ఓ హాస్పిటల్ లో నర్స్ గా కనిపిస్తారట. ఓ ప్రమాదంలో గాయాలపాలైన హీరో ప్రభాస్, పూజా నర్స్ గా పనిచేస్తున్న ఆసుపత్రికి చికిత్స కోసం వస్తాడట.
ప్రభాస్ కి పూజా నర్స్ గా సేవలు చేయాల్సి రావడం, వీరిద్దరి చూపులు, మాటలు కావడం, ప్రేమ చిగురించడం జరిగిపోతాయట. మరి ఈ కథనాల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే, సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.