స్వీయ దర్శకత్వంలో నటించబోతున్న ధనుష్? నలుగురు హీరోలతో తమిళ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్! డిటేయిల్స్

By team telugu  |  First Published Jan 14, 2023, 4:37 PM IST

తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) అత్యంత వేగంగా సినిమాలను పూర్తి చేస్తూ వస్తున్నారు. తెలుగు, తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. తాజాగా మరో ప్రాజెక్ట్ ను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.
 


తమిళ హీరో ధనుష్ వేగంగా సినిమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గతేడాది ఏకంగా ‘మారన్’, ‘తిరుచిత్రంబలం’, ‘నేనే వస్తున్నా’ మూడు చిత్రాలతో అలరించాడు. ఇందులో తిరుచిత్రంబలం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక 2023లోనూ ధనుష్ అదే స్పీడ్ ను కంటిన్యూ చేయనున్నాడు. తెలుగు, తమిళంలో క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైనప్ లో పెడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ధనుష్ తన సొంత డైరెక్షన్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. 

ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నలుగురు హీరోలతో కలిసి నటించబోతున్నారంట. దీనికి ఆయనే దర్వకత్వం వహించబోతున్నట్టు సమాచారం. ధనుష్ తో పాటు మరో ముగ్గు హీరోలు విష్ణు, ఎస్ జే సూర్య, కాళిదాస్ జయరాం కూడా నటిస్తున్నట్టు టాక్. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు చిత్రానికి ‘రాయన్’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చకా చకా కొనసాగుతున్నాయంట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ల బోతుందని, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. గతంలో ‘త్రీ’మూవీలోని రెండు పాటలను స్వయంగా పాడి మెప్పించారు. ‘సార్’ చిత్రంలో ఓ పాటకు సాహిత్యం కూడా అందించారు. తర్వలో దర్శకత్వంతోనూ అలరించబోతుండటం ఆసక్తికరంగా మారింది.

Latest Videos

అలాగే ధనుష్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న తొలిచిత్రం  ‘సార్’ (SiR). తమిళంలో ‘వాతి’గా రిలీజ్ కాబోతోంది. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2023 ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అలాగే తెలుగులోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మరోవైపు దిల్ రాజు బ్యానర్ లోనూ ధనుష్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ‘శ్రీకారం’ తీసిన కిషోర్ రెడ్డి దర్శకుడు అంటూ సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 

అటు తమిళ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’లోనూ నటిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాదేవ్శరన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు జరిగిన ఘటనలతో కథ సాగనుందని తెలుస్తోంది. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈలోగా ధనుష్ తెలుగు, తమిళంలో మరిన్ని ప్రాజెక్ట్స్ ను లైనప్ లో పెడుతుండటం ఆసక్తికరంగా మారింది 
 

click me!