నీటి అడుగున 'సైరా'.. ఆ ఫైట్ లో ఊచకోతే!

Published : Aug 30, 2019, 07:45 PM ISTUpdated : Aug 30, 2019, 07:48 PM IST
నీటి అడుగున 'సైరా'.. ఆ ఫైట్ లో ఊచకోతే!

సారాంశం

ప్రభాస్ నటించిన సాహో విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తోంది. నెల రోజుల వ్యవధిలో మరో భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నరసింహారెడ్డి పాత్రలో నటించారు.   

అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, తమన్నా ఇలా ప్రముఖ నటులంతా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. టీజర్ రిలీజ్ సందర్భంగా ఓ దశ ప్రచార కార్యక్రమాలు ముగిశాయి. త్వరలో రిలీజ్ ప్రమోషన్స్ ని ప్రారంభించనున్నారు. 

సైరా చిత్రంలో ఓ యాక్షన్ సన్నివేశం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి రాజా పంది పాత్రలో తమిళుడిగా నటించారు. సైరా నరసింహారెడ్డి, రాజా పాండి చేతులు కలిపి బ్రిటిష్ వారిని ఊచకోత కోసే ఓ యాక్షన్ సన్నివేశం ప్రధాన ఆకర్షణగా నిలబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ యాక్షన్ ఎపిసోడ్ కొంత భాగం నీటిలో కూడా షూట్ చేశారట. బ్రిటిష్ వారికి కనిపించకుండా నీటిలో ఉంటూ సైరా పోరాటం చేసే సన్నివేశం అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సన్నివేశంలో చిరు, విజయ్ సేతుపతితో పాటు బ్రహ్మాజీ, చరణ్ దీప్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2న సైరా చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Brahmamudi Serial Today Episode: సొంత ఇంటికే కన్నం వేసిన ఐశ్వర్య, దొంగలను చితక్కొట్టిన ఇందు, నందు
Karthika Deepam 2 Today Episode:దీప భయం-మెంటల్ షాక్‍లో సుమిత్ర-దశరథ కంగారు-జ్యోకు కార్తీక్ వార్నింగ్