మహేష్ కు బిగ్ ఛాలెంజ్.. ఫ్యాక్షన్ లీడర్ గా విజయశాంతి!

Published : Jun 05, 2019, 07:27 PM IST
మహేష్ కు బిగ్ ఛాలెంజ్.. ఫ్యాక్షన్ లీడర్ గా విజయశాంతి!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో ' సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో బిజీ కాబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రష్మిక మందన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో ' సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో బిజీ కాబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రష్మిక మందన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం విషయంలో అందరిని ఆసక్తి గురిచేస్తున్న అంశం లేడి సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ. విజయశాంతి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలక పాత్రలో నటించనుంది. 

విజయశాంతి పాత్ర గురించి ఇప్పటికే అనేక ఊహాగానాలు వినిపించాయి. తాజాగా విజయశాంతి ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి విజయశాంతి పాత్రని చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారట. తప్పనిసరి పరిస్థితుల్లో విజయశాంతి తన సొంత ఊరి కోసం ఫ్యాక్షనిస్టుగా మారుతుందట. ఆమె ప్రత్యర్థిగా జగపతి బాబు నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

విజయశాంతి ఇలాంటి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయశాంతి పాత్ర మహేష్ బాబుకు పెద్ద ఛాలెంజ్ అని చెప్పొచ్చు. మహేష్ బాబు హీరోగా విజయశాంతికి మించి పవర్ ఫుల్ గా నటించాల్సి ఉంటుంది. కానీ మహేష్ బాబు తక్కువేం కాదు కదా. మంచి సన్నివేశాలు పడితే మహేష్, విజయశాంతిని ఒకే ఫ్రేములో చూడడం ఫ్యాన్స్ కు పండగే.  

PREV
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?