కన్నీరు మున్నీరైన నటి.. పోలీసులు కూడా రివర్స్!

By tirumala ANFirst Published Jun 5, 2019, 6:04 PM IST
Highlights

మోడల్ గా సత్తా చాటిన తర్వాత నటి మీరా మిథున్ పలు చిత్రాల్లో నటించారు. 8 తోటక్కల్ చిత్రం మీరా మిథున్ కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇదిలా ఉండగా మీరా మిథున్ నిర్వహించాలనుకున్న అందాల పోటీలు వివాదంగా మారాయి.

మోడల్ గా సత్తా చాటిన తర్వాత నటి మీరా మిథున్ పలు చిత్రాల్లో నటించారు. 8 తోటక్కల్ చిత్రం మీరా మిథున్ కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇదిలా ఉండగా మీరా మిథున్ నిర్వహించాలనుకున్న అందాల పోటీలు వివాదంగా మారాయి. తమిళ దివా పేరుతో చెన్నైలో జూన్ 4న అందాల పోటీలు నిర్వహించాలని భావించింది. కానీ కొందరు ఆ పోటీలని అడ్డుకోవడంతో మీరా మిథున్ కు నిరాశ తప్పలేదు. 

ఓ సంస్థ నిర్వహించిన అందాల పోటీల్లో మీరా మిథున్ 2016లో మిస్ సౌత్ ఇండియా కిరిటాన్ని దక్కించుకుంది. తనలా మోడలింగ్ లో రాణించాలనుకునే యువతుల కోసం తాను అందాల పోటీలు నిర్వహిస్తున్నాని గతంలో ప్రకటించింది. అప్పటి నుంచి మీరా మిథున్ కు సమస్యలు తప్పడం లేదు. అందాల పోటీలు నిర్వహిస్తే చంపేస్తాం అని కొందరు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు ఇటీవల మీరా మిథున్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యలయంలో ఫిర్యాదు చేసింది. 

పోలీసులు తన అందాల పోటీలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు మీరా మిథున్ మీడియాతో తెలిపింది. కానీ పోటీలు నిర్వహించే సమయానికి తనకు ఎవరి సహకారం దక్కలేదని మీరా మిథున్ తాజాగా మీడియా ముందు కన్నీరు మున్నీరుగా విలపించింది. అందాల పోటీలు నిర్వహించేందుకు ఓ స్టార్ హోటల్ ని బుక్ చేసుకున్నాం. మోడల్స్ కూడా సిద్ధం అయ్యారు. కానీ నిర్వాహకులు మాత్రం హాజరు కాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. 

నేరుగా వారివద్దకే వెళ్లి అడిగా. పోటీలు నిర్వహించడం కుదరదని అన్నారు. కొందరు వ్యక్తులు పోలీసులని వెంట బెట్టుకుని వచ్చి బెదిరించారు. పోలీసుల సహకారం కూడా తనకు అందలేదని మీరా మిథున్ వాపోయింది. ఎప్పటికైనా అందాల పోటీలు నిర్వహించి తీరతా అని తెలిపింది. 

click me!