విక్కీ, లక్ష్మీలను దత్తత తీసుకున్న మెగా కోడ‌లు

Published : Dec 04, 2021, 09:38 PM IST
విక్కీ, లక్ష్మీలను దత్తత తీసుకున్న మెగా కోడ‌లు

సారాంశం

మెగా కోడలు ఉపాసన నెహ్రు జూపార్క్‌లోని విక్కీ, లక్ష్మీ అనే రెండు సింహాలను ఏడాది కాలం దత్తత తీసుకుంది. ఈ నేపథ్యంలో జూ క్యూరేటర్‌కు సింహాల పోషణకు సంబంధించిన రూ.2లక్షల చెక్కును  అందజేసింది.  

మెగా కోడ‌లు ఉపాసన కొణిదెల (Upasana Kamineni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ భార్యగా, అపోలో ఆసుపత్రి బాధ్యతలు చేపడుతూనే.. మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఉపాసన తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు.మరో పక్క తన తోచిన విధంగా పేదలకు సాయం చేస్తుంటుంది.

అంతేకాకుండా.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫిట్‌నెస్‌తో పాటు తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటుంది. అలాగే ఈ  మెగా కోడ‌లుకు మనుషుల మీదే కాదు మూగ జీవాలపై కూడా వీరికి ప్రేమ ఎక్కువ. త‌రుచు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే ఎప్పటికప్పుడు జంతువుల సంరక్షణ గురించి సూచ‌న‌లు చేస్తోంది.

అయితే తాజాగా ఈ మెగా కోడలు మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌స్సు చాటుకుంది. హైదరాబాద్‏లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‏లో ఉన్న విక్కీ, లక్ష్మీ అనే రెండు ఆసియా సింహాలను దత్తత తీసుకున్నారు.  ఈ నేపథ్యంలో జూ క్యూరేటర్‌కు సింహాల సంరక్షణ బాధ్యతలు.. ఆహారపు ఖర్చులను సంవత్సరం పాటు ఉపాసన కొణిదెల చూసుకోనున్నారు. ఇందుకోసం రూ. 2 లక్షల చెక్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ అందించారు.
 
ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. పార్కులోని అన్ని జంతువుల సంరక్షణ,  మంచి ఆరోగ్య స్థితి తనను చాలా ఆకట్టుకుందని తెలిపింది.జూలో దాదాపు 2000ల‌కు పైగా జంతువులు ఉన్నాయ‌నీ. ఆ జంతువుల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇక్క‌డ సిబ్బంది చూపిస్తున్న అంకితభావం, వారి సేవ అభినంద‌నీయ‌మ‌ని తెలిపారు.
  
అనంతరం..  జూపార్క్ క్యూరేటర్ శ్రీ ఎస్. రాజశేఖర్ మాట్లాడుతూ.. ఉపాసన కొణిదెలకు  కృతజ్ఞతలు తెలిపారు.  జూలోని జంతువుల సంరక్షణ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ఒక సంవత్సరం పాటు సింహాల జతను దత్తత తీసుకోవడానికి చాలా సంతోష‌మ‌ని తెలిపారు.  మూగ జీవాలపై ఉపాసనకు ఉన్న నిబద్ధత చాలా మందిని ఇన్‌స్పైర్‌ చేస్తుందని అన్నారు. ఉపాసనను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మరికొంతమంది జంతువులను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తారని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. గ‌తంలోనూ  ఉపాసన ఒక ఏనుగును దత్తత తీసుకున్నారు. రాణి అనే ఏనుగును సంవత్సరం పాటు దత్తత తీసుకున్న ఉపాసన.. దాని సంరక్షణ కోసం రూ.5లక్షల అంద‌జేసింది.

రామ్‌చరణ్‌-ఉపాసన ల‌కు పెళ్లై ఎనిమిదేళ్లవుతున్నా ఇప్పటివరకు పిల్లలను ప్లాన్‌ చేసుకోలేదని విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. ఉపాస‌న ఎక్కడికి వెళ్లినా జూనియర్‌ రామ్‌చరణ్ లేదా  జూనియర్‌ ఉపాసనను  ఎప్పుడు చూపిస్తారు? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. కానీ ఈ విషయం  తన వ్యక్తిగత విషయమని, మ‌రో సారి ప్ర‌శ్నించ‌వ‌ద్ద‌ని త‌రుచు వార్నింగ్ ఇస్తున్న విష‌యం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్