అల్లు అర్జున్ బాటలో అఖిల్, ఇదైనా కలిసొస్తుందా.. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో కొత్త మూవీ ?

By tirumala ANFirst Published Jul 8, 2024, 3:31 PM IST
Highlights

అక్కినేని యువ వారసుడు అఖిల్ పై ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ అఖిల్ ఇంతవరకు విజయాలు ఖాతా తెరవలేదు.

అక్కినేని యువ వారసుడు అఖిల్ పై ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ అఖిల్ ఇంతవరకు విజయాలు ఖాతా తెరవలేదు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ చిత్రాలు నిరాశపరిచాయి. ఏజెంట్ చిత్రంపై అఖిల్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తనకి తప్పకుండా హిట్ ఇస్తారని అఖిల్ నమ్మరు. 

కానీ ఏజెంట్ దారుణంగా నిరాశపరిచింది. ఈ చిత్రం తర్వాత ఎలాంటి మూవీ చేయాలనే డైలమాలో అఖిల్ ఉన్నాడు. అయితే అఖిల్ ధీర అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ డెబ్యూ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. 

Latest Videos

తాజా సమాచారం మేరకు అఖిల్ మరో చిత్రానికి కూడా ఒకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. వినరో భాగ్యము విష్ణు కథ చిత్రాన్ని తెరకెక్కించిన మురళి కిషోర్.. అఖిల్ కి కథ వినిపించారట. కథ అద్భుతంగా ఉండడంతో అఖిల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రం చిత్తూరు బ్యాక్ డ్రాప్ ఉండబోతోంది. చిత్తూరు జిల్లాలో సాగే విలేజ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సినిమా మొత్తం అఖిల్ చిత్తూరు స్లాంగ్ లో డైలాగులు చెబుతాడని అంటున్నారు. అల్లు అర్జున్ ఆల్రెడీ చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో పుష్ప 1 చిత్రం చేశాడు. పుష్ప 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. చూస్తుంటే అఖిల్ కూడా అదే అదే మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 

click me!