సర్కారు వారి పాట నుండి మహేష్ రోల్ లీక్?

By team telugu  |  First Published Jun 12, 2021, 1:00 PM IST

ఓ వినూత్నమైన సబ్జెక్టుతో దర్శకుడు పరుశురాం సర్కారు వారి పాట చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్థిక నేరాలు ప్రధానంగా ఈ మూవీ రూపొందుతుందని వార్తలు వస్తుండగా మహేష్ పాత్రపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.  


వరుస విజయాలతో ఊపుమీదున్నారు సూపర్ స్టార్ మహేష్. ఆయన గత చిత్రం సరిలేరు నీకెవ్వరు భారీ విజయాన్ని అందుకుంది. మహేష్ కెరీర్ బెస్ట్ వసూళ్లు రాబట్టిన సర్కారు వారి పాట మహేష్ రేంజ్ ఏమిటో మరోమారు నిరూపించింది. సరిలేరు నీకెవ్వరు విడుదలైన ఏడాదికి కొత్త మూవీ సర్కారు వారి పాట షూటింగ్ స్టార్ట్ చేశాడు మహేష్. దుబాయిలో సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ గ్రాండ్ గా షూట్ చేశారు. 


ఇక ఓ వినూత్నమైన సబ్జెక్టుతో దర్శకుడు పరుశురాం సర్కారు వారి పాట చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్థిక నేరాలు ప్రధానంగా ఈ మూవీ రూపొందుతుందని వార్తలు వస్తుండగా మహేష్ పాత్రపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా మహేష్ రోల్ పై ఓ ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. మహేష్ ఈ చిత్రంలో చార్టెడ్ అకౌంట్ గా కనిపిస్తారట. మరి ఈ న్యూస్ లో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. 

Latest Videos


మహేష్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారనేది మరో ప్రచారం. ఇక 2022 సంక్రాంతి సర్కారు వారి పాట విడుదల తేదీగా ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా సర్కారు వారి పాట షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో అనుకున్న సమయానికి సర్కారు వారి పాట విడుదల కష్టమే అని చెప్పాలి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. 

క మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తదుపరి మూవీ ప్రకటించారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అతడు ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ గా నిలిచింది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. 
 

click me!