బాయ్ కాట్ కరీనా అంటున్న నెటిజెన్స్, షాకింగ్ రీజన్!

Published : Jun 12, 2021, 12:21 PM IST
బాయ్ కాట్ కరీనా అంటున్న నెటిజెన్స్, షాకింగ్ రీజన్!

సారాంశం

సీత మూవీలో కరీనా నటించడం లాంఛనమే అని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందువుల పవిత్ర గ్రంధంలోని డివైన్ రోల్ అయిన సీత పాత్ర కరీనా చేయడం ఏమిటని నెటిజెన్స్ అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర సీత పాత్ర కరీనా కపూర్ చేయడానికి వీలులేదని వారు డిమాండ్ చేస్తున్నారు.

రామాయణ గాథపై ఇప్పటికే వందల చిత్రాలు రాగా, ఈ మధ్య మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఈ సబ్జెక్టుపై తెరకెక్కనున్నట్లు అధికారిక ప్రకటనలు జరిగాయి. వీటిలో స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ సీత పేరుతో ఓ మూవీ ప్రకటించడం జరిగింది. టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేయగా సినిమా లవర్స్ ని ఆకర్షించింది. ఈ చిత్రంలో రామాయణ గాధను సీత కోణంలో చెప్పనున్నట్లు తెలుస్తుంది. 


దర్శకుడు అలౌకిక్ దేశాయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హ్యూమన్ బీయింగ్ ప్రొడక్షన్స్ పాన్ ఇండియా చిత్రంగా హిందీ, తెలుగు, కన్నడ,తమిళ బాషలలో నిర్మించనున్నారు. కాగా ఈ మూవీకి సీత పాత్ర కోసం కరీనా కపూర్ ని సంప్రదించినట్లు వార్తలు రావడం జరిగింది. అలాగే సీత మూవీలో నటించడానికి కరీనా చాలా కండిషన్స్ పెట్టారని, ముఖ్యంగా రూ. 12కోట్ల రూపాయల పారితోషికంగా అడిగారని ప్రచారం జరిగింది. 

సీత మూవీలో కరీనా నటించడం లాంఛనమే అని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందువుల పవిత్ర గ్రంధంలోని డివైన్ రోల్ అయిన సీత పాత్ర కరీనా చేయడం ఏమిటని నెటిజెన్స్ అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర సీత పాత్ర కరీనా కపూర్ చేయడానికి వీలులేదని వారు డిమాండ్ చేస్తున్నారు. విడాకులు తీసుకున్న ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న కరీనా కపూర్ సీత పాత్ర చేయడానికి అర్హురాలు కాదని అంటున్నారు. వివిధ కారణాలు చూపుతూ బాయ్ కాట్ కరీనాకపూర్ అంటూ యాష్ ట్రెండ్ చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..