‘ఖైదీ 2’పై ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన దర్శకుడు.. సీక్వెల్ కోసం అదిరిపోయే ప్లాన్..

Published : Jun 12, 2022, 02:10 PM ISTUpdated : Jun 12, 2022, 02:16 PM IST
‘ఖైదీ 2’పై ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన దర్శకుడు.. సీక్వెల్  కోసం అదిరిపోయే ప్లాన్..

సారాంశం

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi)కి ‘ఖైదీ’ సినిమా ఎంతటి సక్సెస్ ను తెచ్చిపెట్టిందో తెలిసిందే. ఈ చిత్ర  దర్శకుడు లోకేష్ గతంలోనే సీక్వెల్ ను ప్రకటించగా.. ప్రస్తుతం ‘ఖైదీ 2’పై ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి.     

చాలా కాలం తరువాత కోలీవుడ్ హీరో కార్తీ ‘ఖైదీ’ సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. 2019లో రిలీజ్ అయిన ఈ తమిళం చిత్రం తెలుగులోనూ విడుదలై హ్యూజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఈ చిత్రం కార్తీ మార్కెట్ ని పెంచేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాలో సాంగ్స్, హీరోయిన్ లేకుండా.. కాస్త కొత్తగా తెరకెక్కించాడు యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ఈ చిత్రం తెచ్చిన సక్సెస్ తో లోకేష్ కు స్టార్ హీరోయిలతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. 

ఆ వెంటనే తమిళ స్టార్ హీరో విజయ్ థళపతితో కలిసి ‘మాస్టర్’ మూవీని తెరకెక్కించాడు. గతేడాది వచ్చిన ఈ చిత్రం యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. లోకేష్ ఫ్రేమింగ్ కు ప్రేక్షకలోకం ఫిదా అయ్యింది. అంతేకాకుండా తాజాగా యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ ప్రధాన పాత్రగా ‘విక్రమ్’  చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రస్తుతం Vikram మూవీ థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది.  ఇప్పటికే హ్యయేస్ట్ గ్రాసింగ్ తమిళ ఫిల్మ్ 2022గా రికార్డు క్రియేట్ చేసింది. 

అయితే ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ ‘ఖైదీ 2’ (Khaidhi)పై ఫోకస్ పెట్టినట్టు  తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు పెరిగాయి. ఫస్ట్ పార్ట్ కన్నా.. సెకండ్ పార్ట్ మరింత సాలిడ్  గా ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఇంటర్వ్యూలో దర్శకుడు లోకేష్ మాట్లాడుతూ .. సినిమా కథను కూడా రివీల్ చేశాడు. ‘హీరో ఢిల్లీ జైలు జీవితం ఎలా గడిచింది? అనే ఫ్లాష్ బ్యాక్ తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. జైల్లో కబడ్డీ ఆడి ఎన్నో మెడల్స్ గెలుచుకుంటాడు. మాఫియా ముఠా నుంచి పోలీసులను కాపాడి, తన కూతురును తీసుకెళ్తాడు. మళ్లీ పోలీసులకు ఆయన అవసరం వస్తుంది. అందుకు దారి తీసిన పరిస్థితులు, ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలతో ఈ కథ నడుస్తుంది’ అని చెప్పుకొచ్చాడు లోకేష్. 

అయితే ‘ఖైదీ’ ఫార్మూలా  హిట్ కావడంతో సీక్వెల్ ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కన్నా.. రెట్టింపు స్థాయిలో బడ్జెట్ ను కూడా ఖర్చుచేయనున్నట్టు  సమాచారం. అంతేకాకుండా సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట మేకర్స్. ఈ దెబ్బతో కోలీవుడ్ మార్క్ ఇండియా మొత్తం మరోసారి కనిపించనుంది. అయితే ఖైదీ ఫస్ట్ పార్ట్ కు ‘విక్రమ్’ సినిమాకు లింకు ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ఖైదీ మరియు విక్రమ్ సినిమాకు మధ్య సాగిన కథే ‘ఖైదీ2’గా రానున్నట్టు టాక్ వినిపిస్తోంది. ‘ఖైదీ2’లో తమిళ స్టార్  సూరియా కూడా నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో పూర్తి సమాచారం అందనుంది.

  

PREV
click me!

Recommended Stories

Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?