
మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట. భారీ అంచనాల మధ్య మే 12న రిలీజ్ అయిన ఈసినిమా ముందు ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆతరువాత కలెక్షన్స్ పరంగా భారీ రెస్పాన్స్ ను సాధించింది. అయితే సర్కారువారి పాట సినిమాలో అన్నింటికంటే హైలెట్ ఈ సినిమా మ్యేజిక్. ఈ సినిమా పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తమన్ స్వరపరిచిన బాణీలు ఈ సినిమా సక్సెస్ లో మెయిల్ రోల్ పోషించాయి. ముఖ్యంగా కళావతి పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటు మ మ మహేషా ,పెన్నీ సాంగ్స్ కూడా ఒక రేంజ్ లో దూసుకుపోయాయి.ఈ పాటతో సర్కారువారి పాట రిజల్ట్ మారిపోయింది. ఎక్కడ చూసినా కళావతి పాటే వినిపిస్తుంది ప్రస్తుతం. ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా పెన్నీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
థమన్ స్వర పరిచిన ఈ పాట ట్యూన్ కొత్తగా.. లిరిక్స్ క్యాచీగా ఉండటంతో ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. ఈ పాటలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో హ్యండ్‌సమ్‌గా కనిపించాడు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను నకాష్ అజీజ్ ఆలపించాడు. రీసెంట్ గా .. ఈ మూవీనుంచి రిలీజ్ అయిన మురారి వా వీడియో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. 14రీల్స్ ఎంటర్టైనమెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లతో కలిసి మహేష్ సర్కారువారి పాటను తెరకెక్కించాడు.
సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపు రెండున్నరేళ్ళకు అభిమానులను ఈ సినిమాతో పలకరించాడు. ఆకలితో ఉన్న అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ పెట్టింది. ఈ సినిమాలో మహేష్‌బాబు క్యారెక్టరైజేషన్, ఎనర్జీ గత ఇంతకు ముందు సినిమాలకంటే భిన్నంగా ఉంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మే 12న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. మహేష్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా సర్కారు వారి పాట నిలిచింది. అయితే మేజర్, విక్రమ్,అంటే సుందరానికీ సినిమాలు రిలీజ్ అవ్వడం.. సర్కారు వారి పాట స్పీడుకు బ్రేకులు పడ్డాయి. వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడంతో దాదాపు అన్ని థియేటర్లలో సర్కారువారి పాటు ను తొలిగించారు.