ఆ టైంలో నాపై శనిగ్రహ ప్రభావం.. నా భార్య బిడ్డలని ఆదుకుంది చిరంజీవే, రచయిత చిన్ని కృష్ణ కామెంట్స్

By tirumala AN  |  First Published Aug 29, 2024, 11:50 AM IST

గతంలో చిన్ని కృష్ణ చిరంజీవిపై తీవ్రమైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఒక పార్టీకి మద్దతుగా చిన్ని కృష్ణ ఆ రకమైన కామెంట్స్ చేశారని పెద్ద ఎత్తున ఆయనపై ట్రోలింగ్ జరిగింది. 


ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఇంద్ర చిత్రం రీ రిలీజ్ అయి ఫ్యాన్స్ ని అలరించింది. 22 ఏళ్ళ తర్వాత కూడా ఫ్యాన్స్ చిరు డైలాగులకు, స్టెప్పులకు అదే విధంగా ఎంజాయ్ చేశారు. దీనితో చిరు ఇంద్ర చిత్ర యూనిట్ ని ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. 

ఈ చిత్రానికి ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ కథ అందించారు. పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. బి గోపాల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇంద్ర చిత్రం రి రిలీజ్ కావడంతో చిన్ని కృష్ణ మీడియా ముందుకు వచ్చారు. ఓ ఇంటర్వ్యూలో చిన్ని కృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

undefined

గతంలో చిన్ని కృష్ణ చిరంజీవిపై తీవ్రమైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఒక పార్టీకి మద్దతుగా చిన్ని కృష్ణ ఆ రకమైన కామెంట్స్ చేశారని పెద్ద ఎత్తున ఆయనపై ట్రోలింగ్ జరిగింది. చిరంజీవి ఏ రోజూ ఇంటికి పిలిచి తనకి ఇస్తరు వేయలేదని అన్నారు. ఇటీవల చిన్ని కృష్ణ చిరంజీవి నుంచి సత్కారం అందుకోవడం విశేషం. 

ఈ సందర్భంగా చిన్ని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ సమయంలో నాపై శనిగ్రహ ప్రభావం  ఎక్కువగా ఉండేది. ఇతరుల మాటలు ఎక్కువగా వినేశాను. అందుకే చిరంజీవి పై మాట తూలాను. వాస్తవానికి తాను ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం చిరంజీవి గారే. ప్రతి ఏడాది చిరంజీవి గారు నాపై కృతజ్ఞత చూపిస్తుంటారు. ఆర్థికంగా సాయం చేస్తుంటారు. నా భార్య బిడ్డలు ఈ రోజు సంతోషంగా ఉన్నారంటే అందుకు కారణం చిరంజీవి గారే. 

ఇంద్ర చిత్రానికి అశ్విని దత్, చిరంజీవి గారు ఇచ్చిన డబ్బుతోనే ఇల్లు కట్టుకున్నా. నాకు ఇంత సంపాదన వచ్చిందంటే కారణం ఆ చిత్రమే. సినిమా హిట్ అయిపోయింది కదా అని చిరు నన్ను ఎప్పుడూ వదిలేయలేదు. ప్రతి ఏడాది నా గురించి ఆరా తీస్తుంటారు. నా కారు డ్రైవర్ కి కూడా నేను ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేశా. అంతలా నేను ఆర్థికంగా నిలదొక్కుకున్నానంటే అందుకు కారణం చిరంజీవే అని చిన్ని కృష్ణ తెలిపారు. 

చిరంజీవి ఇచ్చిన డబ్బుతో నా కారు డ్రైవర్ కి, ఇతర సిబ్బందికి బంగారు ఉంగరాలు చేయించా అని తెలిపారు. చిన్ని కృష్ణ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

click me!