ఓటీటీలో వస్తోన్న అంతర్జాతీయ అవార్డు చిత్రం..

By Aithagoni RajuFirst Published Feb 2, 2021, 6:57 PM IST
Highlights

అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న ఇండియన్‌ డైరెక్టర్‌ జో ఈశ్వర్‌ తాజాగా మరో విభిన్నమైన సినిమాతో వస్తున్నారు. తాజాగా ఆయన `8119 మైల్స్` అనే సినిమాని తెరకెక్కించారు. గతంలో `చారుహాసన్‌, అనుహాసన్‌ నటించిన `కుంతపుర` చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. అలాగే దాదాపు 26 డాక్యుమెంటరీలు రూపొందించారు.

అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న ఇండియన్‌ డైరెక్టర్‌ జో ఈశ్వర్‌ తాజాగా మరో విభిన్నమైన సినిమాతో వస్తున్నారు. తాజాగా ఆయన `8119 మైల్స్` అనే సినిమాని తెరకెక్కించారు. గతంలో `చారుహాసన్‌, అనుహాసన్‌ నటించిన `కుంతపుర` చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. అలాగే దాదాపు 26 డాక్యుమెంటరీలు రూపొందించారు. ఇప్పుడు రూపొందించిన `8119 మైల్స్` సినిమా ఇప్పటికే ఇజ్మీర్‌ ఇంటర్నేషన్‌ రెఫ్యూజీ ఫిల్మ్ ఫెస్టివల్‌, టర్కీ, రెలిజియోని పోపోలి ఫిల్మ్ ఫెస్టివల్‌, ఇటలీ, లారస్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌, ఎస్టోనియా, లిస్ట్ ఆఫ్‌ సెషన్స్, ఫైన్యుడ్‌ వంటి చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడి అవార్డులందకుంది. ప్రస్తుతం ఎలిజబెత్‌ టౌన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌, కెంటుకీ, యూఎస్‌ చిత్రోత్సవాల్లో ప్రీమియర్‌గా ఉంది. 

తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుంది. ప్రముఖ వెబ్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ 5లో దీన్ని విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నెల ఐదున సాయంత్రం ఐదు గంటలకు ఇది ప్రీమియర్‌ కానుంది. గాబ్రియేల్‌ డిసెల్వా కథతో ఈ సినిమా తెరకెక్కింది. అంటే ప్రధానంగా వలసదారుల కథని చెబుతుంది. ఇందులో కథకుడు గోవాకి చెందిన మెకానిక్‌. యూకే సందర్శించాలనేది ఆయన కళ. అందుకోసం అనేక ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. దీంతో  అక్రమ వలసదారులు పత్రాలు లేకుండా ప్రయాణించడానికి ఉపయోగించే పురాతన మార్గంలో గాబ్రియేల్ రిసార్ట్స్ వెంట  అనిల్ అనే అపరిచితుడితో, గాబ్రియేల్ రెండు ఖండాలలో, వేర్వేరు సమయ మండలాల్లో తన గమ్యస్థానానికి వెళ్తాడు.  అనిశ్చితులు, ఇబ్బందులు, ఎడారులు, మంచు, సంస్కృతులు,  విశ్వాసం వారి ప్రయాణాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. హృదయానికి హత్తుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది` అని దర్శకుడు తెలిపారు. 

click me!