చిరంజీవి `ఆచార్య`లో మరో సూపర్‌ స్టార్‌..నాలుగు రోజులుగా ట్రెండ్‌ అవుతున్న టీజర్‌..

By Aithagoni Raju  |  First Published Feb 2, 2021, 5:00 PM IST

చిరంజీవి హీరోగా రూపొందుతున్న `ఆచార్య` టీజర్‌ ఇటీవల విడుదలై యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌ ఈ సినిమా గురించి వినిపిస్తుంది. ఇందులో ఓ సూపర్‌ స్టార్‌ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. 


చిరంజీవి హీరోగా రూపొందుతున్న `ఆచార్య` చిత్రంలో క్రమంలో భారీ తారాగణం యాడ్‌ అవుతుంది. దీంతో సినిమా రేంజ్‌ మారిపోతుంది. ప్రస్తుతం ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. `సిద్ధ` అనే పాత్రలో ఆయన కనిపించనున్నారు. కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. రామ్‌చరణ్‌ సరసన సరసన రష్మిక మందన్నా నటిస్తుందని టాక్‌. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో స్టార్‌ హీరో కనిపించనున్నారు. 

కన్నడ స్టార్‌ సుదీప్‌ విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. ఆయన ఇప్పటికే తెలుగులో `రక్తచరిత్ర`, `ఈగ`, `బాహుబలి`, `సైరా` చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా `ఈగ` సినిమాలో ఆయన నటన ఆడియెన్స్ ని మెప్పించింది. ఇప్పుడు సుదీప్‌ తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యారు. చిరంజీవి  నటించిన ప్రతిష్టాత్మక చిత్రం `సైరా`లోనూ అవుకు రాజుగా మెప్పించారు. తాజాగా మరోసారి చిరంజీవితో కలిసి నటించబోతున్నారు. `ఆచార్య` చిత్రంలో కీలక పాత్ర కోసం సుదీప్‌ని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో నటించేందుకు ఆయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ప్రస్తుతం ఆయన కన్నడలో `విక్రాంత్‌ రోనా` చిత్రంలో నటిస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర లోగోని దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాలో విడుదల చేసిన సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. 

Latest Videos

దీంతో ఈ సినిమా రేంజ్‌ మరింతగా పెరిగిపోతుంది. ఇప్పటికే ఇటీవల విడుదలైన టీజర్‌ భారీ వ్యూస్‌తో దూసుకుపోతుంది. దాదాపు 13మిలియన్‌ వ్యూస్‌ని పొందినట్టు, నాలుగు రోజులు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్నట్టు చిత్ర బృందం చెప్పింది. ఇలా ఓ వైపు సినిమాకి సంబంధించిన ప్రమోషనల్‌ విషయాలు, మరోవైపు భారీ కాస్టింగ్‌ సినిమా రేంజ్‌ని పెంచేస్తున్నాయి. దీన్ని కూడా పాన్‌ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాత రామ్‌చరణ్‌, నిరంజన్‌రెడ్డి. మే 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 
 

click me!