యాంకర్ శ్రీముఖిని అంతగా ఇబ్బంది పెట్టిందెవరు..?

Published : Jan 04, 2019, 11:59 AM ISTUpdated : Jan 04, 2019, 12:05 PM IST
యాంకర్ శ్రీముఖిని అంతగా ఇబ్బంది పెట్టిందెవరు..?

సారాంశం

బుల్లితెరపై యాంకర్ గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి మధ్యలో సినిమాల్లో నటించినప్పటికీ వర్కవుట్ కాలేదు. దీంతో ఈ బ్యూటీ బుల్లితెరకే పరిమితమైంది. 

బుల్లితెరపై యాంకర్ గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి మధ్యలో సినిమాల్లో నటించినప్పటికీ వర్కవుట్ కాలేదు. దీంతో ఈ బ్యూటీ బుల్లితెరకే పరిమితమైంది. అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది.

అయితే తాజాగా ఈ బ్యూటీ ట్విట్టర్ వేదికగా తన బాధను వెళ్లగక్కింది. మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుందని, డబ్బుకే ప్రాధాన్యతనిస్తున్నరని అమ్మడు చాలా బాధ పడిపోయింది. జనం మావత్వాన్ని మర్చిపోయారా..? అని ప్రశ్నించిన శ్రీముఖి గతంలో చాలా మంది తనను ఇదే ప్రశ్న అడిగారని కానీ తను మాత్రం ఇప్పటివరకు వారి అభిప్రాయంతో ఏకీభవించలేదని చెప్పింది.

కానీ వ్యక్తిగతంగా తను అనుభవించిన తరువాత కలిసి ఉంటున్నాం.. జీవిస్తున్నాం అంటే దానికి డబ్బు ఒకటే కారణమనిపిస్తోందని ఎమోషనల్ అయింది. మనలో మానవత్వమంతా కోల్పోయేలోపు ఈ ప్రపంచం అంతమైపోతే నేను చాలా సంతోషిస్తానంటూ ట్విట్టర్ రాసుకొచ్చింది. అంతగా శ్రీముఖిని ఎవరు ఇబ్బంది పెట్టారని అభిమానులు ఆమెని ప్రశ్నిస్తున్నా.. సమాధానం మాత్రం చెప్పడం లేదు. 

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది