Neha Eliminated: రాజ్‌ తో రిలేషన్‌ బయటపెట్టిన నేహా.. ఎలిమినేట్‌ అయ్యాక ఆ విషయం చెబుతూ ఎమోషనల్‌..

Published : Sep 25, 2022, 11:10 PM ISTUpdated : Sep 25, 2022, 11:37 PM IST
Neha Eliminated: రాజ్‌ తో రిలేషన్‌ బయటపెట్టిన నేహా.. ఎలిమినేట్‌ అయ్యాక ఆ విషయం చెబుతూ ఎమోషనల్‌..

సారాంశం

నేహా మూడో వారంలో ఎలిమినేట్‌ అవుతుందని గత రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో వార్త వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా అదే జరిగింది. ఆమె వెళ్తూ వెళ్తూ చాలా ఎమోషన్‌ అయ్యింది.

బిగ్‌ బాస్‌ తెలుగు 6 రియాలిటీ షో మూడో వారం పూర్తి చేసుకుంది. ఆదివారం ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అయ్యారు. తక్కువ ఓట్లు వచ్చిన నేహా చివరికి ఎలిమినేట్‌ అయ్యింది. చివరి వసంతి,నేహా మిగలగా త్రాసులో వెయిట్‌ ద్వారా నేహాని ఎలిమినేట్‌గా నాగ్‌ తేల్చాడు. అంతా ఊహించినట్టుగానే ఆమె ఎలిమినేట్ కావడం విశేషం. ఆమె ఎలిమినేట్‌ కాబోతుందని, గత రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో వార్త వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా అదే జరిగింది. దీంతో పెద్దగా ఆశ్చర్యమేయలేదు. 

ఇదిలా ఉంటే ఆమె వెళ్తూ వెళ్తూ చాలా ఎమోషన్‌ అయ్యింది. స్టేజ్‌పైకి వెళ్లి నేహాకి నాగార్జున ఓ టాస్క్ పెట్టాడు. హౌజ్‌లో దమ్మున్న వాళ్లెవరు, దుమ్మున్నవాళ్లు ఎవరు అనేది చెప్పమని నేహాకి టాస్క్ ఇవ్వగా ఆమె రేవంత్‌, ఆరోహి, ఇనయ, అర్జున్‌, గీతూ, వసంతి వాళ్లు దుమ్ము వాళ్లు అని, వారి ఆటలో జెన్యూనిటీ లేదని తెలిపారు. ఎలాగైనా గెలవాలని దేనికైగా తెగబడతారని, వారి ఆట తీరు కరెక్ట్ కాదని చెప్పింది నేహా. 

మరోవైపు దమ్మున్న వారిలో.. చంటి, రాజ్‌, సుదీప, ఆది, బాలాదిత్య, శ్రీహాన్‌, శ్రీసత్యల పేర్లు చెప్పింది నేహా చౌదరి. వీరంతా స్టెప్‌ బై స్టెప్‌ గేమ్‌ ఆడుకుంటూ, ఒక్కో మెట్టు ఎదుగుతున్నారని తెలిపింది. చంటి ఆట తీరు సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని, సుదీప చాలా సపోర్ట్ చేస్తుందని, ఆమెని చూస్తుంటే ఎమోషనల్‌గా ఉంటుందని తెలిపింది. బాలాదిత్య చాలా స్ట్రాంగ్‌ అది, బాగా ఆడతాడని తెలిపింది. శ్రీహాన్‌ అమ్మాయిలను చాలా గౌరవిస్తారని, గేమ్‌ ఆడే తీరు బాగుంటుందని చెప్పింది. ఆదిరెడ్డి, శ్రీసత్య సైతం బలమైన వాళ్లని, వారితో బాండింగ్ చాలా బాగుందని తెలిపింది నేహా. 

ఈ క్రమంలో రాజ్‌శేఖర్‌ గురించి వెల్లడించి ఎమోషనల్‌ అయ్యింది నేహా చౌదరి. వీరిద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తుందనే రూమర్స్ స్ప్రెడ్‌ అయిన నేపథ్యంలో తాజాగా అదే విషయాన్ని కన్ఫమ్‌ చేసింది నేహా. హౌజ్‌లోకి వచ్చాక ఆయనతో మంచి బాండ్‌ ఏర్పడిందని తెలిపింది. గత కొన్నేళ్లుగా తన జీవితంలోకి ఏ అబ్బాయిని రానివ్వలేదని, ఎవరు వచ్చినా దూరం పెట్టానని, కానీ హౌజ్‌లో రాజ్‌ తనకు చాలా బాగా దగ్గరయ్యాడని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. అతను గ్రేట్‌ ఫ్రెండ్‌ అని, బయటకు వచ్చాక కూడా ఆయనకు తానే బాడీ గార్డ్ అంటూ చెప్పింది. ఈ క్రమంలో రాజ్‌ సైతం గుండెబరువెక్కినట్టు కనిపించడం విశేషం.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే