ఎఫ్3లో ఆ విషయం మాత్రం చాలా సీక్రెట్ అంటున్న అనిల్ రావిపూడి, తెరపైనే చూడాలట

Published : May 17, 2022, 11:20 AM IST
ఎఫ్3లో ఆ విషయం మాత్రం చాలా సీక్రెట్ అంటున్న అనిల్ రావిపూడి, తెరపైనే చూడాలట

సారాంశం

త్వరలో ఎఫ్3 మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు అనిల్ రావిపూడి. ఈ మూవీ గురించి మాట్లాడిన ఆయన.. ఆ ఒక్క విషయం మాత్రం చెప్పనంటున్నాడు.. ఇంతకీ ఏంటది.  

చాలా తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు  అనిల్ రావిపూడి. పటాస్ నుంచి మొదలు పెట్టి.. ప్రతి సినిమా కామెడీతో అదరగొడుతూనే ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేసే అవకాశం కొట్టేసిన అనిల్.. సరిలేరు నీకెవ్వరు సినిమా చేసి.. ఆయనతో కూడా సూపర్ హిట్ కొట్టాడు. ఇక తాజాగా  మరో సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. 

ఇక అనిల్ రావిపూడి.. తెరకెక్కించిన ఎఫ్ 3 మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నెల 27 న రిలీజ్ కు సన్నాహాలు చెస్తున్నారు టీమ్.  గతంలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన  ఎఫ్ 2  సినిమాకి ఇది సీక్వెల్ గా రూపొందుతోంది. ఆ సినిమాలో మాదిరిగానే వెంకటేశ్ - తమన్నా ఒక జోడీగా, వరుణ్ తేజ్ - మెహ్రీన్ ఒక జంటగా ఈ సినిమాలో కనిపించనున్నారు. 

అయితే ఈసారి మాత్రం ఈసినిమాలో సునిల్ తో పాటు.. సోనాల్ చౌహాన్ కూడా ఇంపార్టెంట్ రోల్ పోషించారు. కాని ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ఇంత వరకూ రివిల్ చేయలేదు టీమ్. ఈ విషయంలో అనిల్ రావిపూడి మాత్రం ఈ విషయంలో చాలా సీక్రేట్ మెయింటేన్ చేస్తున్నాడు. సోనాల్ పాత్రగురించి ఆయనకు చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.  

ఇక తాజా ఇంటర్వ్యూలో సోనాల్ పాత్రను గురించిన ప్రశ్న అనిల్ రావిపూడికి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. సినిమాలో ఏ విషయం అయినా చెపుతాను కాని.. ఆమె పాత్రను గురించి మాత్రం అడగొద్దు అన్నారు. అంతే కాదుఆమె పాత్ర సస్పెన్స్. సోనాల్ పాత్ర ఏమిటి? ఆమె ఏం చేస్తుందనేది తెరపై చూడాల్సిందే. ఇప్పుడే చెప్పేస్తే ఆ కిక్కుపోతుంది ఆడియన్స్ లో మరింత ఇంట్రెస్ట్ పెంచేశారు అనిల్ రావిపూడి. 

ఇక సోనాల్ పాత్ర ఎలా ఉంటుందో తెరపై చూడాల్సిందే. ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి వచ్చిన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరు హీరోల పెర్ఫామెన్స్ కు ఎక్స్ ట్రా డోస్ ఆడ్ చేసినట్టు వీడియోస్ చూస్టుంటే తెలుస్తోంది. కామెడీ డోస్ కూడా పెంచినట్టు అర్ధం అవుతోంది. మరి ఈసారి ఎఫ్3 టీమ్  డబుల్ బ్లాక్ బస్టర్ కొడతారా లేదా అనేది చూడాలి. 

PREV
click me!

Recommended Stories

2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా
ఎన్టీఆర్ 'సింహాద్రి'ని వద్దనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.? అస్సలు ఊహించలేరు