Illu Illalu Pillalu Today Episode Jan 13: డబ్బు పోగొట్టిన సాగర్, అమూల్యకు పెళ్లి ఇష్టం లేదన్న వేదవతి

Published : Jan 13, 2026, 10:07 AM IST
Illu Illalu Pillalu Today Episode Jan 13 Vedavati tells Amulya doesnt want marry

సారాంశం

Illu Illalu Pillalu Today Episode Jan 13: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో అమూల్య నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ అమూల్య వాలకం చూసి వేదవతికి అనుమానం వస్తుంది. అదే విషయాన్ని రామరాజుకు చెబుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూడండి. 

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో టీ షర్ట్ మీద లవ్ సింబల్ వేసి ఆంగ్ల అక్షరాలు డిపి అని రాసి ఉంటాయి. అవి చూసి అందరూ ధీరజ్ ను ఏడిపిస్తారు. వేదవతి కూడా చూసి ఏమిట్రా ఈ అవతారం అని అడుగుతుంది. ఈ లోపు రామరాజు ముగ్గురు కొడుకులు పిలుస్తారు. చందు, వల్లి జంటకు వంట పనులు అప్పచెబుతాడు రామరాజు. ఇక ధీరజ్, ప్రేమలకు నిశ్చితార్థపు ఉంగరాలు తెమ్మని చెబుతాడు. ఇక సాగర్ కి టెంట్ సామాన్ల పని అప్పగిస్తాడు. సాగర్ తో రామరాజు కిరాణా వాడికి డబ్బులు తక్కువ ఇచ్చావంట ఎందుకు? అని అడుగుతాడు. సాగర్ లక్ష రూపాయలు తీసుకొని మిగతావి కిరాణా సామాను వాళ్లకి చెల్లిస్తాడు. ఆ విషయమే రామరాజు అడుగుతాడు. ఇంతలా వేదవతి అక్కడికి వచ్చి ఎప్పుడూ డబ్బులు గురించి అడుగుతారు అని చెప్పి సాగర్ ని అక్కడి నుంచి పంపించేస్తోంది. కానీ రామరాజు సాగర్ ని డబ్బులు అడిగిన విషయం నర్మద వినేస్తుంది.

అమూల్యకు పెళ్లి ఇష్టం లేదు

వేదవతి రామరాజుతో అమూల్యకి ఈ పెళ్లి ఇష్టం లేనట్టు కనిపిస్తోందండి అని చెబుతుంది. అప్పుడు రామరాజు అమూల్య నీతో ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు. దానికి వేదవతి దాని వాలకం చూస్తుంటే ఇష్టం లేదని అర్థం అయిపోతుంది అని అంటుంది వేదవతి. వెంటనే రామరాజు అమూల్య నా కూతురు నేను చెప్పినట్లే వింటుంది అని నమ్మకంగా చెబుతాడు. అయినా వేదవతి నేను మీకోసమే చెబుతున్న మీ కూతురు ఏదైనా పొరపాటు చేస్తే మీరు తట్టుకోలేరు.. అందుకే ముందే చెబుతున్నానని హెచ్చరిస్తుంది. అయినా కూడా రామరాజు వినకుండా ఏం కాదులే భయపడకు అనేస్తాడు.

ఇక ఇక్కడి నుంచి సీన్ ధీరజ్ దగ్గరికి మారుతుంది. ప్రేమ నిద్రపోతున్నట్లు నటిస్తుంటే ధీరజ్ వచ్చి నిద్ర లేపుతాడు. టీ షర్ట్ మీద లవ్ సింబల్ గురించి అడుగుతాడు. మీ పేరు పక్కన నా పేరు ఉండడం ఇష్టం లేదు అని అంటాడు. దానికి ప్రేమ ఇంకోసారి ఇలా అన్నావంటే టాటూ వేయించేస్తా జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. ధీరజ్ ‘నాన్న నిశ్చితార్థం ఉంగరాలు తీసుకురమ్మని చెప్పారు వెళ్దాం పద’ అని అడుగుతాడు. దానికి సారీ చెబితేనే వస్తానని, లేకపోతే మామయ్య గారికి చెపుతానని బెదిరిస్తుంది. దీంతో ధీరజ్ సారీ చెప్పి ప్రేమని అక్కడి నుంచి తీసుకెళ్తాడు.

సాగర్ టెన్షన్

ఇక సాగర్ కిరాణా షాప్‌కి ఇవ్వాల్సిన లక్ష రూపాయలు సొంతానికి వాడుకోవడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. అదే విషయం నర్మద కూడా వచ్చి అడుగుతుంది. నువ్వు మావయ్య గారు అడిగినట్లు ఆ డబ్బును వాడుకున్నావా అని అడుగుతుంది. దానికి సాగర్ ఇప్పటికే నాన్న అడిగి బాధ పెట్టారు, నువ్వు కూడా ఎందుకు అడుగుతావు అని అంటాడు. అయినా సరే నర్మద గుచ్చి గుచ్చి అడగడంతో సాగర్ కి కోపం వస్తుంది. తర్వాత నర్మదతో ఫ్రెండ్ కి డబ్బులు ఇచ్చానని చెబుతాడు. అప్పుడు నర్మద ఇంట్లో చెడ్డపేరు వస్తుంది సాయంత్రంలోపు డబ్బు తెచ్చి కిరణా షాప్ వాడికి కట్టేయమని చెబుతుంది. కానీ ఆ డబ్బుని అప్పటికే స్టాక్ మార్కెట్లో పెట్టేస్తాడు సాగర్. ఇక నర్మదని పెళ్లి పనులు చూడాలి కదా అని తీసుకువెళ్తాడు. కానీ లో లోపల సాగర్ బాధపడుతూనే ఉంటాడు. నా దగ్గర ఎక్కువ డబ్బు లేకపోవచ్చు కానీ ఏదో రోజు సంపాదిస్తాను అప్పుడు చెబుతాను అందరి పని అనుకొని వెళ్లిపోతాడు. ఇక ప్రేమ, ధీరజ్ నిశ్చితార్థపు ఉంగరాలు తీసుకోవడానికి షాపుకు వెళ్తారు. నేటితో ఈ ఎపిసోడ్ ముగిసిపోతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: మారిపోయిన మనోజ్.. రోహిణీ, ప్రభావతిలకు ఊహించని బహుమతి
Suma Kanakala : రోడ్డు మీద బుక్స్ అమ్మే వాడిలా ఉన్నావు.. స్టార్ డైరెక్టర్ ను అవమానించిన యాంకర్ సుమ