Pawan Kalyan కొత్త సినిమా ఇదే.. కన్ఫమ్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. న్యూ ఇయర్‌ సర్‌ప్రైజ్‌

Published : Jan 01, 2026, 11:47 AM IST
pawan kalyan, surender reddy, vakkantham vamsi

సారాంశం

Pawan Kalyan Next Film: పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులను గుడ్ న్యూస్‌ చెప్పారు. అదిరిపోయే న్యూస్‌ చెప్పారు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉండబోతుందని ప్రకటించారు. 

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌తో రాబోతున్న పవన్‌ కళ్యాణ్‌

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్‌ గతేడాది `ఓజీ`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆకలి తీర్చాడు. ముంబయి గ్యాంగ్‌ స్టర్‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసుని షేక్‌ చేసిన విషయం తెలిసిందే. సుజీత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దాదాపు మూడు వందల కోట్లు వసూలు చేసింది. ఇక త్వరలో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`తో రాబోతున్నారు పవన్. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది.

పవన్ కళ్యాణ్‌ నెక్ట్స్ సినిమా ఇదే

ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త సినిమా ప్రకటన వచ్చింది. పవన్‌ నెక్ట్స్ చేయబోతున్న సినిమా ఏంటో తెలిసిపోయింది. కొత్త ఏడాది సందర్భంగా అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ నెక్ట్స్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. దర్శకుడు సురేందర్‌ రెడ్డి, రైటర్‌ వక్కంతం వంశీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ని కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోని పంచుకుంటూ డ్రీమ్‌ నిజం కాబోతుందని నిర్మాత రామ్‌ తాళ్లూరి తెలిపారు.

డ్రీమ్‌ నిజం కాబోతుందని నిర్మాత ప్రకటన

ఈ సందర్భంగా రామ్‌ తల్లూరి ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ పెడుతూ, `జోడించిన చేతులతో, నిండు హృదయంతో, నా కల `జైత్ర రామ మూవీస్‌` బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెం 1గా ఇది ప్రారంభం కాబోతుంది. మన ప్రియమైన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రేమ, ఆశీస్సులతో నామకరణం చేయబడింది. సురేందర్‌ రెడ్డి, వక్కంతం వంశీతో కలిసి పనిచేస్తున్నాను. ఎప్పటికీ గర్వపడతాను. డ్రీమ్‌ ప్రాజెక్ట్ లోడింగ్‌` అని తెలిపారు నిర్మాత రామ్‌ తాళ్లూరి. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. పవన్‌ నెక్ట్స్‌ మూవీ ఇదే ఉండబోతుందని తెలుస్తోంది.

 

 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Nandamuri Balakrishna: క్లాస్ సినిమాతో బాలయ్యకి చుక్కలు చూపించిన జగపతి బాబు.. పాపం సుమన్ బలి
Psych Siddhartha Movie Review: సైక్‌ సిద్ధార్థ మూవీ రివ్యూ, రేటింగ్‌.. జెంజీ మూవీతో నందుకి హిట్‌ పడిందా?