
దేవదాస్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా ఆ తర్వాత టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులోని స్టార్ హీరోలందరి సరసనా నటించింది. అయితే ‘దేవదాస్’ సినిమా టైమ్‌లో ఒక విషయంలో ఆమెకు చాలా భయం వేసిందట. అందుకే ఆ సమయంలో దేశం వదిలి పారిపోయిందట. ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
‘సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నాకు హిందీ కూడా రాదు. తెలుగు అస్సలు రాదు. సెట్స్‌లో ఇంగ్లీష్‌లోనే మాట్లాడేదాన్ని. అయితే మీడియా ఎదుటకు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిపడ్డాను. కనీసం హిందీలో అయినా మాట్లాడమని వాళ్లు అడిగేవారు. అప్పుడు చాలా భయం వేసింది. ఆ భయంతోనే భారత్ నుంచి వచ్చేసి మూడు వారాలపాటు అమెరికాలో ఉండిపోయాను. నన్ను వదిలేయమని దర్శకులను వేడుకునేదాన్ని. కానీ, ఆ తర్వాత అక్కడి ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించార’ని చెప్పింది ఇలియానా.