బాయ్ ఫ్రెండ్ తో ఇలియానా లిప్ లాక్

Published : Sep 18, 2017, 04:57 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
బాయ్ ఫ్రెండ్ తో ఇలియానా లిప్ లాక్

సారాంశం

ప్రేమ మైకంలో మునిగి తేలుతున్న  ఇలియానా బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో లిప్ లాక్ వైరల్ అయిన ఫోటోలు

ప్రేమ మైకంలో తేలియాడుతోంది ఇలియానా. దేవదాసు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. తెలుగులో ఈ తరం హీరోలలో దాదాపు అందరితో కలిసి నటించిన ఇలియానా.. ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీని కాదని బాలీవుడ్ కి చెక్కేసింది. బాలీవుడ్ లో అడపా దడపా సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తున్న ఇలియానా.. సినిమా విషయాల్లో కన్నా.. తన పర్సనల్ విషయాల్లోనే ఈ మధ్య వార్తల్లోకెక్కుతోంది.

 

ఇలియానా కి ఆండ్రూ నిబోస్ అనే బోయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. మొదట ఆండ్రూ.. తన ఫ్రెండ్ మాత్రమే అని చెప్పిన ఇల్లు.. ఇప్పుడు మాత్రం బాహాటంగానే తన బోయ్ బోయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటోంది.అంతేనా, తనను పూర్తిగా అర్థం చేసుకున్న ఆండ్రూ, తన జీవిత భాగస్వామి అయ్యేందుకు అన్ని అర్హతలూ కలిగి వున్నవాడంటూ చెప్పేసింది. అంతటితో ఆగిపోలేదు. అతనికి లిప్ లాక్ ఇస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  ‘ ఏ మూమెంట్ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ మ్యాడ్ నెస్’ అనే కాప్షన్ ని ఆ ఫోటోలకి జత చేసింది. ఇంకేముంది. ఇప్పుడు ఆ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి.

 

ఇటీవల 'పబ్లిక్‌లో ఉన్న ప్రతీ సందర్భంలోనూ నవ్వుతూ కనిపించడం సాధ్యపడకపోవచ్చు. నేను పబ్లిక్ ఫిగర్‌ని మాత్రమే. పబ్లిక్ ప్రాపర్టీని కాదు. మీరు నా బాయ్‌ఫ్రెండ్ గురించి అడగటంలో తప్పులేదు. కానీ అతడి జాతి గురించి అడగటం బాధకలిస్తోంది. అతను తెల్లగా ఉండటం కారణంగానే నేను డేటింగ్ చేస్తున్నానని చెప్పుకుంటున్నారు. అది నాకు నచ్చడం లేదు. నేను చేస్తున్నది తప్పు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. మీ తల్లులు, చెల్లెల పట్ల అలాగే ప్రవర్తిస్తున్నారా..? మీ వాళ్ళకిచ్చే గౌరవం నాకెందుకు ఇవ్వరు’ అంటూ కారాలు మిరియాలు నూరిన  ఇలియానా.. ఇప్పుడు ఏకంగా ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?