'ఘోస్ట్' తో రొమాన్స్ కి త్రిష, ఇలియానా పోటీ.. ఎవరికో ఆ ఛాన్స్ ?

pratap reddy   | Asianet News
Published : Sep 20, 2021, 11:07 AM IST
'ఘోస్ట్' తో రొమాన్స్ కి త్రిష, ఇలియానా పోటీ.. ఎవరికో ఆ ఛాన్స్ ?

సారాంశం

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో 'ఘోస్ట్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హై ఓల్టేజ్ యాక్షన్ అంశాలతో ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో 'ఘోస్ట్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హై ఓల్టేజ్ యాక్షన్ అంశాలతో ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ ని ఎంపిక చేశారు. ఓ షెడ్యూల్ లో కూడా ఆమె పాల్గొంది. 

కానీ ప్రస్తుతం కాజల్ అగర్వాల్ గర్భవతి అంటూ వార్తలు వస్తున్నాయి. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు దంపతులు ఫస్ట్ బేబీకి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కాజల్, కిచ్లు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాజల్ గర్భవతి కావడంతో ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు టాక్. 

దీనితో చిత్ర యూనిట్ మరో హీరోయిన్ కోసం సెర్చింగ్ మొదలు పెట్టారు. తాజాగా నాగ్ కి జోడిగా త్రిష, ఇలియానా లాంటి సీనియర్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకర్ని ప్రవీణ్ సత్తారు ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదట. 

త్రిష ఆల్రెడీ నాగార్జునతో కింగ్ మూవీలో నటించింది. ఇలియానా ఇంతవరకు నాగార్జున సరసన నటించలేదు. పైగా ఇలియానా టాలీవుడ్ లో కంబ్యాక్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరో ప్రవీణ్ సత్తారు ఎవరిని ఎంచుకుంటాడో చూడాలి. ఒకవేళ వీరిద్దరూ కుదరకపోతే బాలీవుడ్ నుంచి ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Winner Prize Money : టైటిల్ విన్నర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ తో పాటు, భారీగా బెనిఫిట్స్ కూడా, ఏమిస్తారంటే?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ చూడలేక వెనక్కి వెళ్ళిపోయిన స్టార్ హీరో, అసలేం జరిగిందో తెలుసా ?