ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే

Published : May 03, 2023, 07:48 AM IST
ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే

సారాంశం

లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఇళయరాజా అన్న కొడుకు పావళర్ శివన్ (60) మంగళవారం రోజు అకస్మాత్తుగా మృత్యువాత పడ్డారు. 

చిత్ర పరిశ్రమలో తరచుగా ఊహించని విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఇళయరాజా అన్న కొడుకు పావళర్ శివన్ (60) మంగళవారం రోజు అకస్మాత్తుగా మృత్యువాత పడ్డారు. 

పావళర్ శివన్ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఇళయరాజా అన్నయ్య,  పావళర్ శివన్ తండ్రి పేరు  పావళర్ వరదరాజన్. ఆయన కూడా సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, గాయకుడిగా పనిచేశారు. ఇళయరాజా ఇంతటివారు కావడంలో వరదరాజన్ పాత్ర ఎంతైనా ఉందని కుటుంబ సభ్యులు చెబుతుంటారు. ఇళయరాజాని ప్రోత్సహించింది ఆయనే. 

వరదరాజన్ 1973లోనే మరణించారు. కాగా ఆయనకి ఇద్దరు కుమారులు. ఒక కొడుకు 2020లో కిడ్నీ సమస్య కారణంగా మరణించగా మరో కొడుకు శివన్ ఇప్పుడు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శివన్ అకస్మాత్తుగా గుండెపోటుకి గురికావడంతో మంచం మీది నుంచి పడిపోయినట్లు తెలుస్తోంది. దీనితో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. శివన్ అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. 

శివన్ మంచి గిటారు వాయిద్యకారుడు. ఆయన ఇళయరాజా మ్యూజిక్ టీంలోనే కొనసాగుతూ వచ్చారు. సంగీత దర్శకుడిగా కూడా రెండు మూడు చిత్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ సక్సెస్ కాలేదు. శివన్ కుటుంబ సభ్యులతో కలసి పాండిచ్చేరిలోనే ఉంటున్నారు. ఆయన మృతితో తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అన్న కొడుకు మరణించడంతో ఇళయరాజా దిగ్భ్రాంతికి గురైనట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

IMDB మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్.. టాప్ 20లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే?
నయనతార హీరోయిన్ గా ఒకే కథతో 3 సినిమాలు.. ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు?