అప్పుడు `మంత్ర`, మొన్న `బట్టర్‌ ఫ్లై`.. ఇప్పుడు `ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్`

Published : May 02, 2023, 11:02 PM IST
అప్పుడు `మంత్ర`, మొన్న `బట్టర్‌ ఫ్లై`.. ఇప్పుడు `ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్`

సారాంశం

ఛార్మి నటించిన `మంత్ర`, అనుపమా పరమేశ్వరన్‌ నటించిన `బట్టర్‌ ఫ్లై` చిత్రాలు రూపొందించిన బ్యానర్‌ నుంచి మరో క్రేజీ మూవీ రాబోతుంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన సినిమాలు రూపొందుతున్నాయి. కంటెంట్‌ బేస్డ్ చిత్రాల జోరు సాగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు `ది స్టోరీ ఆఫ్‌ ఏ బ్యూటీఫుల్‌ గర్ల్` చిత్రం రాబోతుంది. ఛార్మి కౌర్‌ నటించిన `మంత్ర`, అనుపమా పరమేశ్వరన్‌ నటించిన `బట్టర్‌ఫ్లై` చిత్రాలను రూపొందించిన `జెన్‌ నెక్ట్స్ సంస్థ నుంచి వస్తోన్న చిత్రమిది. నిహాల్ కోదాటి హీరోగా, దృషికా చందర్ హీరోయిన్ లతో పాటు సినయర్ నటుడు మధునందన్, భార్గవ పోలుదాసు, భావన దుర్గం, సమర్థ యుగ్ అలాగే ప్రముఖ జర్నలిస్ట్ దేవి నాగావల్లీ, మెహెర్ శ్రీరామ్ ఇతర పాత్రలు పోషిస్తున్న చిత్రమిది. 

రవి ప్రకష్‌ బోడపాటి దర్శకత్వంలో సస్పెన్స్, థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. జెన్‌ నెక్ట్స్ పతాకంపై ప్రసాద్‌ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 12న విడుదల కాబోతుంది. రిలయన్స్ సంస్థ ద్వారా ఇది రిలీజ్‌ అవుతుంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్, యాక్షన్ తో పాటు, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఓ మర్డర్ కేసును సాల్వ్ చేసే ప్రాసెస్ లో అన్ని కోణాల్లో జర్నలిస్టులు, పోలీసులు ఇన్వెస్ట్ గేషన్ చేసే నేపథ్యంలో ఈ కథ సాగుతున్నట్లు తెలుస్తుంది. 

`క్రైమ్ థ్రిల్లర్స్ కు ప్రాణం పోసేది మ్యూజికే.. మరీ అలాంటి అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను గిడియన్ కట్టా అందించారు. సినిమాలో ప్రతీ ఫ్రేమ్ కూడా చాలా అద్బుతంగా ఉన్నాయి. అలాగే సినిమాలో వాడిన కలర్స్ కూడా చాలా బాగా పోట్రెట్ చేశారు డీఓపి అమర్ దీప్ గుత్తుల. ప్రతీ ఫ్రేమ్ లో సినిమా నిర్మాణ విలువలు గొప్పగా కనిపిస్తున్నాయి. ప్రవీణ్ పూడి తన ఎడిటింగ్ తో మెస్మరైజ్ చేశారు. ది మోస్ట్ టెర్రిఫిక్ కేస్ ఇన్ ద ఇండియన్ హిస్ట్రీ అంటూ.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. మరీ ఆ కేసేంటో దాన్ని ఎలా చేదించారో తెలుసుకోవాలంటే మే 12 వరకు వెయిట్ చేయాల్సిందే` అని చెబుతుంది యూనిట్‌. 

చాలా వైవిధ్యమైన కథతో నేటితరం యువతకు నచ్చేలా ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ సినిమాను తెరకెక్కించామని, యువతకు కావల్సిన అన్ని అంశాలతో పాటు ఓ మంచి సందేశం ఈ సినిమాలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందని, మంత్ర సినిమాతో ఛార్మీ కి ఎలాంటి పేరు వచ్చిందో ఈ సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అంతే మంచి పేరు వస్తుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.

 `నాన్నకు ప్రేమతో`, `సీతారామమ్` వంటి సినిమాలను విడుదల చేసిన ప్రతిష్టాత్మకమైన "రిలియాన్స్ ఎంటర్ టైన్మెంట్" సంస్థ "ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్" సినిమా చూసి, వారికి ఎంతగానో నచ్చి.. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుల చేస్తుండటం సంతోషంగా ఉందని మేకర్స్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను మే 12న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని తెలుస్తుంది. జెన్ నెక్ట్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై హీరోయిన్ అనుపమకు ఉన్న అనుబంధంతో `ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ ` టీమ్ తో ఓ ఇంటర్ వ్యూ కూడా చేసింది. ప్రస్తుతం ఆ ఇంటర్ వ్యూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందని చెప్పింది యూనిట్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?