కత్రీనా కైఫ్ పాటకు డాన్స్ చేస్తూ.. పడబోయిన విక్కీ కౌశల్... వైరల్ అవుతున్న వీడియో..

Published : May 29, 2023, 05:44 PM ISTUpdated : May 29, 2023, 05:45 PM IST
కత్రీనా కైఫ్ పాటకు డాన్స్ చేస్తూ.. పడబోయిన విక్కీ కౌశల్... వైరల్ అవుతున్న వీడియో..

సారాంశం

ఐఫా వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అరబ్బ్ దేశంలో జరుగుతున్న ఈ వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖులు తెగ సందడి చేస్తున్నారు.     

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌-2023 వేడుక యూఏఈ  రాజధాని అబుదాబి లో అట్ట హాసంగా జరిగాయి. బాలీవుడ్ అంతా ఐఫాలో తెగ హడావిడి చేస్తున్నారు. ఇక ఈ వేడుకలకు  బాలీవుడ్ స్టార్స్‌ విక్కీ కౌశల్‌ తో పాటు  అభిషేక్‌ బచ్చన్‌  హోస్ట్‌లుగా వ్యవహరించారు. బీటౌన్‌ తారలు  ఈ వేడుకల్లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పాటలు, డాన్స్ లు అబ్బో పెద్ద ఉత్సవంలా చేశారు. ఇక ఈ  వేడుకల్లోనే చిన్న చిన్న కాంట్రవర్సీలు.. ఫీన్నీ మూమెంట్స్.. అన్నీ సోషల్ మీడియాలో హైలెట్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా  విక్కీ కౌశల్  ను సల్మాన్ పట్టించుకోకపోవడం వివాదంగా మారింది. 

ఈ వేడుకలకు సబంధించి న ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.ఇక అది పక్కన పెడితే.. ఈ వేడుకల్లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఐఫాలో విక్కీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తోంది. వీడియోలో విక్కీ కౌశల్‌, సారా అలీఖాన్ , రాఖీ సావంత్‌  అదిరిపోయే డాన్స్ పెర్ఫామెన్స్ కనిపించింది. అయితే ఇందులో ఏం ఫన్నీ ఉంది అంటే.. వీరంతా ఎంతో ఉత్సాహంగా  కత్రినా కైఫ్‌ హిట్‌ ఐటమ్‌ సాంగ్‌ షీలాకీ జవానీ కి డ్యాన్స్‌ చేస్తుండగా.. డ్యాన్స్‌ చేస్తూ.. చేస్తూ..అనుకోకుండా రాఖీసావంత్‌ విక్కీని ఢీ కొడుతుంది. 

 

రాఖీ సావంత తగలడంతో.. విక్కీ  ఒక్కసారిగా కిందపడిపోబోపోయాడు. వెంటనే కంట్రోల్ చేసుకుని.. తన పరువు కాపాడుకున్నాడు.  తనను తాను కంట్రోల్‌ చేసుకుని మళ్లీ  డ్యాన్స్‌ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?