స్టైలీష్ లుక్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు, వైరల్ అవుతున్న ఫోటో

Published : Feb 19, 2023, 11:16 AM IST
స్టైలీష్ లుక్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు, వైరల్ అవుతున్న ఫోటో

సారాంశం

స్టైలీష్ లుక్ లో  సందడి చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అయాన్.  సోషల్ మీడియాలో సందడి చేస్తూ.. బన్నీ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు స్టార్ కిడ్.   

ఈ మధ్య స్టార్ హీరోలతో పాటు.. స్టార్ కిడ్స్ కూడా ఫుల్ ఫేమస్ అవుతున్నారు. నెట్టింట్లో సందడి చేస్తున్నారు. స్టార్ హీరోల ఫ్యాన్స్ లో సరికొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నారు. మహేష్ కూతురు సితార, ఎన్టీఆర్ పిల్లలతో పాటు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ స్టార్స్ అంతా అప్పుడప్పుడు తమ పిల్లలతో టైమ్ స్పెండ్ చేసిన ఫోటోలు, వీడియోలను నెట్టింట పంచుకుంటుంటారు. దాంతో వారి అభిమానులు కూడా స్టార్ కిడ్స్ ను చూసి మురిసిపోతుంటారు. 

ఈక్రమంలో సోషల్ మీడియాలో ఎక్కవగా సందడిచేసే స్టార్ కిడ్స్ లో మహేష్ పిల్లల తరువాత అల్లు అర్జున పిల్లలే ముందు వరుసలో ఉన్నారు. ఇంట్లో బన్నీ పిల్లలు అయాన్ కాని.. అర్హా కాని అల్లరి పనిచేసినా.. ఏదైనా ముద్దొచ్చే పనిచేసినా.. వెంటనే సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు అల్లు కపుల్. ముఖ్యంగా బన్నీ భార్య స్నేహా రెడ్డి పిల్లలకు సబంధించిన విడియోలు ఎక్కువగా పంచుకుంటారు. ఇక బన్నీ అప్పుడప్పుడు తన పిల్లలతో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తూ.. సరదా వీడియోలను పంచుకుంటుంటారు. 

 

ఈక్రమంలో అల్లు అర్జున్ తనయుడు అయాన్ కు సబంధించిన లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ స్టైలీష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ఇక అయాన్ స్టైలీష్ లుక్ లోకి వచ్చాడు. ఈ ఫోటోను స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో పంచుకోగా.. బన్నీ ప్యాన్స్ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు. ఈ లుక్ లో అయాన్ ను చూసి దిల్ ఖుష్ అవుతున్నారు అల్లు ఫ్యాన్స్. ఈ లుక్ లో అయాన్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో ఉన్నాడు. అలవైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ ఈ హెయిర్ స్టైల్ లోనే కనిపించారు. ఈక్రమంలో...తమ హీరో వారసుడంటూ ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు.

ఇక ఇప్పటికే ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ తెరంగేట్రం చేసేశారు. అర్హ అయితే శాకుంతలం సినిమాలో నటించేసింది కూడా. అయాన్ కూడా అలవైకుంఠపురములో సినిమాలో ఓ సాంగ్ లో సందడి చేశాడు. ఇక అవకాశాలు వస్తే.. చైల్డ్ ఆర్టిస్టు లుగా వీరిని బన్నీ ఎంకరేజ్ చేస్తాడని తెలుస్తోంది.ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2  పై దృష్టి పెట్టాడు. ఈసినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సాధించిన అల్లు అర్జున్. పుష్ప 2 ను అంతకు మించి తెరకెక్కించాలని పక్కా ప్రణాళికతోఉన్నాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?