తండ్రి కోసం వెక్కి వెక్కి ఏడుస్తున్న తారకరత్న కూతురు.. ఓదార్చలేకపోతున్న కుటుంబ సభ్యులు

Published : Feb 19, 2023, 10:42 AM IST
తండ్రి కోసం వెక్కి వెక్కి ఏడుస్తున్న తారకరత్న కూతురు.. ఓదార్చలేకపోతున్న కుటుంబ సభ్యులు

సారాంశం

నందమూరి తారకరత్న మరణం కుటుంబ సభ్యుల్లో తీరని వేదన మిగిల్చింది. అభిమానులు సైతం శోకంలో మునిగిపోయారు. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు.

నందమూరి తారకరత్న మరణం కుటుంబ సభ్యుల్లో తీరని వేదన మిగిల్చింది. అభిమానులు సైతం శోకంలో మునిగిపోయారు. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు. నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభంలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే. కుప్పంలో చికిత్స అనంతరం బెంగుళూరుకి తరలించారు. 

వైద్యులు ఎంతగానో శ్రమించినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉంటూ వచ్చింది. ఒక దశలో ఆయన హెల్త్ స్టేబుల్ గా ఉంది.. కోలుకునే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. కానీ కుటుంబ సభ్యుల ప్రార్థనలు, అభిమానుల ఆశలు ఫలించలేదు. 

ప్రస్తుతం తారకరత్న భౌతిక కాయాన్ని ఆయన నివాసంలో ఉంచారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి. వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం. ఈ దంపతులకు మొదట ఒక పాప జన్మించింది. తారకరత్న కుమార్తె పేరు నిష్క. ఆ తర్వాత వీరికి కవల పిల్లలు సంతానం కలిగినట్లు తెలుస్తోంది. 

అయితే తారక రత్నకి కుమార్తె నిష్క అంటే పంచ ప్రాణాలు. కూతురు కూడా తండ్రిని ఎప్పుడూ విడిచి ఉండలేదు. కానీ ఇక కుమార్తెకి తారకరత్న శాశ్వతంగా దూరం అయ్యారు. ఇది తలచుకుని నిష్క విషాదాన్ని ఆపుకోలేకపోతోంది. ఆమె పసి హృదయం తండ్రి కోసం తల్లడిల్లిపోతోంది. తండ్రి పార్థివ దేహాన్ని చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తోంది. నిష్కని ఓదార్చడం కుటుంబ సభ్యుల తరం కూడా కావడం లేదు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హృదయాలు ద్రవించేలా చేస్తున్నాయి. 

39 ఎల్లా చిన్న వయసులో మరణించడం కలలో కూడా ఊహించని విషాదం. తారక రత్న సినిమాల్లో గట్టి ప్రయత్నమే చేసారు. కానీ ఆయనకి ఎక్కువ విజయాలు దక్కలేదు. ఇకపై రాజకీయాల్లో రాణించాలని అనుకున్నారు. టిటిడిలో యాక్టివ్ అవుతున్న తరుణంలో ఈ దారుణం జరిగింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?