
తమిళంలో 'ఐస్' చిత్రాన్ని నిర్మించి అందులో హీరోగా నటించిన అశోక్.. మొరాకో దేశానికి చెందిన ఓ యువతిని పెళ్లాడారు. 2003లో'ఐస్' సినిమా విడుదలైంది. దీని తరువాత అశోక్ పెద్దగా సినిమాల్లో నటించలేదు.
ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో జనాలు కూడా అశోక్ ని మర్చిపోయారు. ఇది ఇలా ఉండగా.. అలీమా జట్ అనే మొరాకో యువతిని పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు అశోక్.
పెళ్లికూతురు దేశంలోనే అగడీర్ అనే నగరంలో ఇటీవలే వీరి వివాహం జరిగిందని.. త్వరలోనే చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్లు షో తరఫున సోమవారం నాడు ఒక ప్రకటనను విడుదల చేశారు.