నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది.. శ్రీరెడ్డి కామెంట్స్

First Published Jul 26, 2018, 12:56 PM IST
Highlights

నేను ఒంటరి మహిళను.. నా వెనుక తల్లితండ్రులు, స్నేహితులు ఎవరూ లేరు. మళయాలంలో ఒక నటికి అన్యాయం జరిగితే ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఆమె తరఫున నిలబడింది. కానీ ఇక్కడ నేను ఒక్కదాన్నే ఫైట్ చేస్తున్నాను

తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ సంచనలం కామెంట్స్ చేసి పలువురు సినీతారలపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు చెన్నైకు వెళ్లి అక్కడ తారలపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. టాలీవుడ్ లో కొందరు సెలబ్రిటీలు ఆమెపై లీగల్ గా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. కోలీవుడ్ లో కూడా వారాహి అనే నటుడు ఆమెపై వ్యభిచారం కేసు కింద అరెస్ట్ చేయాలని పోలీస్ కంప్లైంట్ చేశారు.

ఇండస్ట్రీలో కొందరిని టార్గెట్ చేసి వారి దగ్గర డబ్బు గుంజుతుందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ విషయంపై స్పందించింది శ్రీరెడ్డి. 'నేను బాధితురాలిని. న్యాయం కోసం పోరాడుతున్నాను. కానీ కొందరు నన్ను వ్యభిచారిని అని ముద్ర వేస్తున్నారు. అది ఎంత బాధ కలిగిస్తుందనే విషయం వాళ్లకు అర్ధం కావడం లేదు. మా ఫ్యామిలీ ఈ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకోగలదు.

నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. నేను ఒంటరి మహిళను.. నా వెనుక తల్లితండ్రులు, స్నేహితులు ఎవరూ లేరు. మళయాలంలో ఒక నటికి అన్యాయం జరిగితే ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఆమె తరఫున నిలబడింది. కానీ ఇక్కడ నేను ఒక్కదాన్నే ఫైట్ చేస్తున్నాను. నాలాగా మరే ఆడపిల్ల బాధ పడకూడదని నేను పోరాడుతున్నాను' అంటూ ఎమోషనల్ అయింది. కోలీవుడ్ లో ఆమె లారెన్స్, మురుగదాస్, సుందర్ సి, శ్రీకాంత్ వంటి వారిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

click me!