
పొలిటికల్ డ్రామాగా తెలుగులో తెరకెక్కిన చిత్రం ‘గాడ్ ఫాదర్’ (Godfather). మలయాళంలో ‘లూసిఫర్’గా విజయాన్ని సాధించి తెలుగులోనూ గాడ్ ఫాదర్ గా బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), లేడీ సూపర్ స్టార్ నయనతారా ప్రధాన పాత్రలో నటించారు. సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేశారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మాతలు రామ్ చరణ్, ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.
అక్టోబర్ 5న థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ లో నిర్వహించిన ‘గాడ్ ఫాదర్’ బ్లాక్ బాస్టర్ సక్సెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికరమై వ్యాఖ్యలు చేశారు. సినిమా విజయవంతం అవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అభిమానులు, సినీ ప్రియులు ‘గాడ్ ఫాదర్’ను ఆదరించడం మరింత జోష్ నిస్తోందని తెలిపారు. సినిమాను ఎంతో శ్రమించి నిర్మించామన్నారు. తానెప్పుడూ సినిమాను తన సినిమాగా చూడనని.. ఒక ప్రేక్షకుని స్థానంలో ఉండి చూస్తానన్నారు. అప్పుడే మూవీలోని లోటుపాట్లు, తప్పులు కనిపిస్తాయని వాటిని ఎప్పటికప్పుడూ సరిచేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
అదేవిధంగా చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో దర్శకుడు మోహన్ రాజాతో ట్రావెల్ అయ్యానని తెలిపారు. తను ఇచ్చిన ప్రతి సూచనలను దర్శకుడు స్వీకరిస్తూనే.. అప్పటికప్పుడు చేయాల్సిన మార్పులనూ చాలా కొత్తగా చేయడం గొప్ప విషయమన్నారు. నటీనటులు సత్యదేవ్, నయనతార, సునిల్, మురళీ శర్మ అద్భుతంగా నటించారని, వందశాతం తమ వంతుగా శ్రమించారని ప్రశంసించారు. ఇక టెక్నీషియన్స్ కూడా నిద్రలేని రాత్రుల్లోనూ సినిమా కోసం కష్టపడ్డారని చెప్పారు. ఇందుకు ప్రతి ఒక్కరికి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇక అభిమానులు ‘గాడ్ ఫాదర్’ను ఇంతటి విజయవంతం చేసిన అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. కంటెంట్ లో దమ్ముంటే ఆడియెన్స్ తప్పకుండా సినిమాను విజయవంతం చేస్తారని నేనెప్పుడూ నమ్ముతాను. అదే తరహాలో ఈ చిత్రాన్ని తీసుకొచ్చాం. అన్నుకున్నట్టుుగానే ప్రేక్షకులు మూవీని ఆదరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమాలో యంగ్ యాక్టర్స్ తో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉందన్నారు. నయా జోష్ నిండిందని తెలిపారు. యంగ్ టాలెంట్స్ తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు.