
ఎన్నో అంచనాల మధ్య చలాకీ చంటి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాడు. జబర్దస్త్ లో ఆయన ఎనర్జీ చూసి బిగ్ బాస్ షోలో చెడుగుడు ఆడుకుంటారని అందరూ భావించారు. అయితే ఆయన పెర్ఫార్మన్స్ చాలా పూర్ గా ఉంది. గేమ్, టాస్క్ పట్ల ఆయన ఆసక్తి చూపడం లేదు. చాలా తక్కువగా మాట్లాడుతూ డల్ గా ఉంటున్నారు. తనపై ఆయనకే నమ్మకం పోయింది. నన్ను బయటికి పంపినా పర్లేదని చంటి అన్నారు. చంటికి ఏమాత్రం ఆసక్తి లేదని తెలిసిపోతుంది.
అదే విషయాన్ని నాగార్జున ముందు ఒప్పుకున్నాడు. శనివారం కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఈ వారం నీ పెర్ఫార్మన్స్ ఎలా ఉందని చంటిని అడగ్గా... నేను ప్లాప్ సార్ అన్నాడు. అంటే నువ్వే ప్రేక్షకుల ముందు నీ గేమ్ బాగోలేదని ఒప్పుకుంటున్నావా? అని నాగ్ అడిగారు. నిర్మొహమాటంగా చంటి నేను సరిగా ఆడటం లేదని ఒప్పుకున్నారు. ఈ క్రమంలో నాగార్జున చంటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో పడ్డారు.
ఇక ఈ వారం ఎలిమినేషన్స్ లో చంటి కూడా ఉన్నారు. చంటికి షో పట్ల ఆసక్తి లేని క్రమంలో ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. చంటి తీరు చూస్తుంటే అదే ఆయన కోరుకుంటున్నారు. హౌస్ నుండి బయటికి వచ్చేసినా చంటి కెరీర్ కి ఢోకా లేదు. అందుకే ఆయన సీరియస్ గా తీసుకోవడం లేదు. చంటి నేచర్ హౌస్ కి ఏమాత్రం సెట్ కావడం లేదు. ఇక చంటితో పాటు ఇనయా, ఫైమా, బాల ఆదిత్య, ఆదిరెడ్డి, అర్జున్, మెరీనా, వాసంతి ఎలిమినేషన్స్ లిస్ట్ ఉన్నారు. గత నాలుగు వారాల్లో షాని, అభినయశ్రీ, నేహా, ఆరోహి రావు ఎలిమినేట్ అయ్యారు.