
టాలీవుడ్ లో పవర్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్ గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘హంట్’(Hunt). చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో సుధీర్ బాబు, భరత్ నివాస్, శ్రీకాంత్ మేక కీలక పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం సమకూర్చగా.. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలను చూస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసేందుకు క్రేజీ అప్డేట్స్ ను అందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు అంచనాలను పెంచుతున్నాయి. మొన్న వచ్చిన టీజర్ కూడా సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. అదిరిపోయే యాక్షన్ తో సుధీర్ బాబు అలరించబోతున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ అందించారు. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో అన్సౌన్ చేశారు.
‘పాపతో పైలం’ (Papa Tho Pailam) టైటిల్ తో ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఐటెం సాంగ్ గా ఆడియెన్స్ ను అలరించబోతోంది. అక్టోబర్ 11న ఉదయం 10:04 గంటలకు ఈ అప్డేట్ ను రిలీజ్ చేయనున్నారు. ఐటెం సాంగ్ గా రానున్న ఈ పాటలో బోల్డ్ బ్యూటీ అప్సరా రాణి నటించడంతో అంచనాలు పెరిగాయి. అప్సరా రాణి ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ నటించిన ‘క్రాక్’లో ‘భూం బద్దల్’ ఐటెం సాంగ్ తో ఊర్రూతలూగించిన విషయం తెలిసిందే. మరోసారి స్పెషల్ సాంగ్ లో నటించబోతుండటంతో ఆసక్తి క్రియేట్ అయ్యింది.
వరుసగా చిత్రాల్లో నటిస్తున్న సుధీర్ బాబు రీసెంట్ గా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’తో అలరించాడు. ప్రస్తుతం ‘హంట్’తో పాటు మరోచిత్రంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ లోనూ నటిస్తున్నారు. అలాగే ‘మామా మచ్ఛీంద్ర’ చిత్రం కూడా సుధీర్ బాబు ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటోంది.