స్టార్ హీరోలతో సినిమాలా..? నా వల్ల కాదు!

Published : Jun 28, 2018, 05:44 PM IST
స్టార్ హీరోలతో సినిమాలా..? నా వల్ల కాదు!

సారాంశం

పెళ్లిచూపులు చిత్రంతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకర్షించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ మొదటి సినిమాతోనే 

పెళ్లిచూపులు చిత్రంతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకర్షించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. లిమిటెడ్ బడ్జెట్ లో తీసిన ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో పాటు తరుణ్ భాస్కర్ కు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాత తరుణ్ కు స్టార్ హీరోలతో కలిసి పని చేసే ఛాన్స్ వచ్చింది. తను మాత్రం మళ్లీ కొత్తవాళ్లతోనే సినిమా చేశాడు.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమా రూపొందించాడు. శుక్రవారం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నలుగురు కుర్రాళ్లు షార్ట్ ఫిలిం తీయడం కోసం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన తరుణ్ భాస్కర్ స్టార్ హీరోలతో సినిమాలు చేయడం తన వల్ల కాదని చెబుతున్నాడు. దానికి కారణం కూడా చెబుతున్నాడు. అదేంటంటే.. హీరోల చుట్టూ తిరిగే కథలు రాసే టాలెంట్ తనకు ఇంకా రాలేదని, కథ సిద్ధం చేసుకున్న తరువాతే అందులో నటీనటులుగా ఎవరిని తీసుకోవాలో నిర్ణయించుకుంటానని వెల్లడించాడు.

ప్రస్తుతం స్టార్ హీరోల మైండ్ సెట్ కూడా మారింది. కథ కొత్తగా ఉంటే సినిమా చేయడానికి సిద్ధపడుతున్నారు. అలాంటిది తరుణ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ మాత్రం స్టార్ హీరోలతో సినిమాలు చేయనని చెప్పడం బాధాకరం. 
 

PREV
click me!

Recommended Stories

సమంత, అఖిల్ అక్కినేనితో పాటు 2025లో పెళ్లి చేసుకున్న 10 జంటలు ఎవరో తెలుసా?
Sivaji: సామాన్లు కనపడేలా బట్టలు వేసుకోకండి... అమ్మాయిల దుస్తులపై శివాజీ షాకింగ్ కామెంట్స్