నా తప్పు లేకపోయినా.. నిందిస్తున్నారు: పూనమ్ కౌర్ ఆవేదన!

Published : Sep 04, 2018, 06:17 PM ISTUpdated : Sep 09, 2018, 12:41 PM IST
నా తప్పు లేకపోయినా.. నిందిస్తున్నారు: పూనమ్ కౌర్ ఆవేదన!

సారాంశం

'మాయాజాలం' చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది నటి పూనమ్ కౌర్. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. కానీ ఏ సినిమా కూడా ఆమెకు నటిగా మంచి బ్రేక్ ఇవ్వలేకపోయింది

'మాయాజాలం' చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది నటి పూనమ్ కౌర్. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. కానీ ఏ సినిమా కూడా ఆమెకు నటిగా మంచి బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఇటీవల 'శ్రీనివా కళ్యాణం' సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం ఆమె 'స్వర్ణ ఖడ్గం' అనే సీరియల్ లో నటిస్తోంది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ పై ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

ట్విట్టర్ వేదికగా పవన్ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడ్డారు. దీంతో కొన్నాళ్ల పాటు ట్విట్టర్ కి దూరంగా గడిపింది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ ని విమర్శిస్తూ ఆమెపై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఆమె ఎమోషనల్ అవుతూ ఓ ట్వీట్ చేసింది. కృష్ణాష్టమి సందర్భంగా ఓ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేయబోతున్నానని ఆదివారం ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు.

చాలా సంతోషంతో, మనస్ఫూర్తిగా రూపొందించిన వీడియో ఇదని అన్నారు. 'పీకే లవ్' అని హ్యాష్ ట్యాగ్ కూడా జోడించింది. దీంతో ఆమెకు నెటిజన్ల నుండి వ్యతిరేకంగా కామెంట్లు వచ్చాయి. దీంతో తాజాగా మరొక ట్వీట్ చేసింది. ''నేను ఎంత కష్టపడ్డాను, ఎంత చక్కగా, నిజాయతీగా పనిచేశాను అనేది ఇక్కడ ముఖ్యం కాదు. నా తప్పులేకపోయినా అనవసరంగా నన్ను నిందిస్తూ, విమర్శిస్తున్నారు. నా హృదయానికి చేరువైన ఈ వీడియోను విడుదల చేయదలచుకోవడం లేదు'' అంటూ రాసుకొచ్చింది.  

PREV
click me!

Recommended Stories

అందుకే పవన్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ రివ్యూపై నిర్మాత కామెంట్స్..ఆ సినిమాల వల్లే థియేటర్ల సమస్య