
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎల్లప్పుడూ నూతనోత్సహంతో కనిపిస్తుంటారు. సోషల్ ఇన్సిడెంట్స్ ను గమనిస్తూ ఎప్పటికప్పుడు ప్రశ్నలు సంధిస్తూ ఉంటాడు. అయితే ఆర్జీవీ గతంలో జర్నలిస్ట్, యాంకర్ స్వప్న (Swapna)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా తనకు ఎలాంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ లేవని చెప్పాడు. తానెప్పుడూ ఎవరిపైనా ప్రేమ, జాలి, కోపం చూపించనని కూడా చెప్పుకొచ్చిన సందర్భాలున్నాయి. అయితే తొలిసారి తనకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయంటూ ఇన్ స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు.
సినీ రంగంలో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఆర్జీవీ (RGV) గొప్పతనం, ఉన్నత ఆలోచనా విధానం అందరినీ ఆకర్షితులను చేస్తాయి. ఆయన జీవన విధానం, వే ఆఫ్ థింకింగ్ ప్రతి ఒక్కరికీ కొంత మేర స్ఫూర్తిదాయంగా ఉంటుంది. ఆయన చెప్పేవన్నీ నిజాలే అయినా.. చేయడం కష్టమంటూ కొందరు అభిప్రాయపడుతుంటారు. మరి కొందరు ఆయనే ఇన్సిపిరేషన్ గా తమ జీవిత లక్ష్యాలను కూడా చేరుకుంటున్నారు. ఆర్జీవీ మేధస్సుకు మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని సినీ ప్రముఖులు చాలా మూవీ ఫంక్షన్స్ లో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఎంతమంది ఆయన మేధస్సును మెచ్చుకున్నా.. ఆయన మాత్రం ఎవరినీ గట్టిగా పొగిడింది లేదు. తన ప్రేమను అమితంగా చూపిన సందర్భాలు లేవు.
మొదటి సారి తనలోనూ ఫీలింగ్స్ ఉన్నాయి. అన్ని భావాలు కలిగిన వ్యక్తినేనని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. ఇందుకు ఇన్ స్టాలో పెట్ డాగ్ ను ప్రేమతో తన ఒడిలో కూర్చొబెట్టుకున్న ఫొటోను పోస్ట్ చేశాడు. ‘నాకు భావాలు ఉన్నాయి’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో తనకు పిల్లలు, ఫ్యామిలీ, పెళ్లి, ఇతర జీవరాశులపై ఎలాంటి ప్రేమ, మక్కువ లేదని చెప్పాడు. కానీ ప్రస్తుతం ఈ పోస్ట్ పెట్టడం పట్ల అందరూ ఆలోచనలో పడ్డారు. ఆర్జీవీ ఎవరి అంచనాలకు దొరకడంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ‘మీరు మారిపోయారు సార్’ అంటున్నారు.