హైపర్ ఆది ప్రపోజ్ చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.?

Published : Feb 15, 2018, 11:20 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
హైపర్ ఆది ప్రపోజ్ చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.?

సారాంశం

వాలెంటైన్స్ డే సందర్భంగా అమ్మాయికి ప్రపోజ్ చేసిన ఫోటో పోస్ట్ చేసిన హైపర్ ఆది హైపర్ ఆది పోస్ట్ చేసిన ఆ ఫోటో వైరల్ ఎందుకంటే ఆది ప్రపోజ్ చేస్తున్న అమ్మాయి తొలిప్రేమలో ప్రియదర్శి లవ్

జబర్దస్త్ లాంటి కామెడీ షోతోపాటు రియాలిటీ షోలలో కామెడీ చేస్తూ.. ఈ మధ్య బుల్లి తెరపైనే సూపర్ స్టార్స్ గా ఎదిగిపోయిన వారిలో హైపర్ అది ఒకరు. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఆది ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా పాపులారిటీని బాగా సంపాదించుకుంటున్నాడు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానిగా.. కత్తి మహేష్ లాంటి క్రిటిక్స్ ను క్రిటిసైజ్ చేసి ఆది తను జబర్దస్త్ ఆది మాత్రమే కాదని... జబ్బర్దస్త్ ఆది అని నిరూపించుకున్నాడు.

 

సినిమాల్లో ఇప్పుడిప్పుడే అవకాశాలను కూడా అందింపుచ్చుకుంటున్న ఆది రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటో ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారింది. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా మనోడు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తూన్నట్లు కనిపించాడు. అయితే ఆ ఫొటో వాలెంటైన్స్ డే రోజుది కాదు. 

 

ఆది తొలిప్రేమ సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఫారిన్ లో షూటింగ్ జరిగినపుడు అక్కడ ఓ అమ్మాయితో కలిసి లవర్ బాయ్ లా స్టిల్ ఇచ్చాడు. ఇక ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ.. అందరికీ హ్యపీ వాలెంటైన్స్ డే.. స్ప్రెడ్ లవ్ అంటూ మెసేజ్ ఇచ్చాడు ఆది. దీంతో ఫాలోవర్స్ ఆ ఫొటోపై చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఆదికి పంచులతో పాటు ప్రపోజ్ చేయడం కూడా వచ్చే..అని ఎవరి స్టైల్ లో వారు కామెంట్స్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు