'జబర్దస్త్' నుండి హైపర్ ఆది ఔట్..?

Published : Nov 06, 2018, 02:20 PM IST
'జబర్దస్త్' నుండి హైపర్ ఆది ఔట్..?

సారాంశం

అతి తక్కువ సమయంలో 'జబర్దస్త్' షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. తన కామెడీ టైమింగ్, పంచ్ లతో ఆడియన్స్ ను నవ్విస్తుంటాడు. అతడి ఎపిసోడ్ కోసం షోని చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు. అంతగా ఈ షోతో పాపులర్ అయిన హైపర్ ఆది ఇప్పుడు షో నుండి బయటకి వెళ్లిపోనున్నాడా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

అతి తక్కువ సమయంలో 'జబర్దస్త్' షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. తన కామెడీ టైమింగ్, పంచ్ లతో ఆడియన్స్ ను నవ్విస్తుంటాడు. అతడి ఎపిసోడ్ కోసం షోని చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు.

అంతగా ఈ షోతో పాపులర్ అయిన హైపర్ ఆది ఇప్పుడు షో నుండి బయటకి వెళ్లిపోనున్నాడా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత సినిమా అవకాశాలు రావడంతో షో నుండి చాలా మంది కమెడియన్లు తప్పుకున్నారు.

ఇప్పుడు వారిలానే హైపర్ ఆదికి కూడా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. ఓ పక్క షో, మరోపక్క సినిమాలతో బిజీగా గడుపుతోన్న హైపర్ ఆది రెండు వారాలుగా షోలో కనిపించడం లేదు. దీంతో ఆది విషయంపై రకరాల చర్చలు మొదలయ్యాయి.

పూర్తిస్థాయిలో సినిమాలలో నటించడానికే అతడు షో నుండి దూరమవుతున్నాడని టాక్. మరోవైపు హైపర్ ఆది 'జనసేన' పార్టీలో జాయిన్ అవుతాడని, ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడానికే షోకి దూరమయ్యాడని కొంతమంది వాదిస్తున్నారు. మరి దీనిపై హైపర్ ఆది స్పందిస్తాడో లేదో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

Hero Karthik: ఆ అలవాటు వల్ల కెరీర్ లో పతనం.. అన్వేషణ హీరో కార్తీక్ ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితి ఏంటి ?
55 ఏళ్ల వయసులో 300 సినిమాలు, 200 కోట్లకు పైగా ఆస్తి, స్టార్ డైరెక్టర్ ను పెళ్లాడిన హీరోయిన్ ఎవరు?