రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

Published : Nov 06, 2018, 01:10 PM IST
రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

సారాంశం

మొత్తానికి రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ వచ్చేసింది. ముందు నుండి చక్కర్లు కొడుతోన్న 'వినయ విధేయ రామ' టైటిల్ ను ఫైనల్ చేస్తూ చిత్రబృందం పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. 

మొత్తానికి రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ వచ్చేసింది. ముందు నుండి చక్కర్లు కొడుతోన్న 'వినయ విధేయ రామ' టైటిల్ ను ఫైనల్ చేస్తూ చిత్రబృందం పోస్టర్ ని విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో రామ్ చరణ్ చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. రెండు చేతులతో ఆయుధాలు పట్టుకొని పరుగెడుతోన్న స్టిల్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈరోజు ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా.. సినిమా టీజర్ ని 9వ తేదీనవిడుదల చేయనున్నారు.

ఫస్ట్ లుక్ తో అయితే ఆకట్టుకున్నాడు మరి టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. చాలా రోజులుగా చరణ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న ఫస్ట్ లుక్, టైటిల్ బయటకి రావడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.

కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ