నోటు ఇస్తే ట్వీట్ వేస్తా.. రాజకీయ పార్టీలకు సెలబ్రిటీల సపోర్ట్!

By Udaya DFirst Published 20, Feb 2019, 12:49 PM IST
Highlights

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో డబ్బు తీసుకొని రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేస్తామని కొందరు తారలు అంగీకరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో డబ్బు తీసుకొని రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేస్తామని కొందరు తారలు అంగీకరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 36 మంది బాలీవుడ్ ప్రముఖులు డబ్బు తీసుకోవడానికి అంగీకరిస్తూ కెమెరాలకు చిక్కారు. 'కోబ్రాపోస్ట్' అనే ఆన్ లైన్ పోర్టల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో మన తారలు దొరికిపోయారు.

రాజకీయ పార్టీల పీఆర్ లుగా కోబ్రాపోస్ట్ విలేకరులు నకిలీ పేర్లతో కొందరు సినీ, టీవీ నటులు, సింగర్స్, డాన్సర్స్ ని వారి మేనేజర్ల ద్వారా సంప్రదించారు. లోక్‌సభ ఎన్నికలు వస్తున్న క్రమంలో తాము చెప్పిన రాజకీయ పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియా లో ప్రచారం చేస్తే.. డబ్బు ఇస్తామని చెబితే దానికి కొందరు సెలబ్రిటీలు అంగీకరించారు. ఇందులో ఎక్కువమంది తారలు నగదు రూపంలో తీసుకోవడానికి అంగీకరించారు.

ఒక్కో పోస్ట్ కి రూ.2 లక్షల నుండి రూ.50 లక్షల వరకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కొందరు తారలు ఎనిమిది నెలల కాంట్రాక్ట్ కి రూ.20 కోట్లు అడిగారు. డబ్బు తీసుకొని ట్వీట్ లు చేయడానికి అంగీకరించిన వారిలో శ్రేయస్ తల్పడే, సన్నీ లియోన్‌, శక్తి కపూర్‌, అమీషా పటేల్‌, టిస్కా చోప్రా, రాఖీ సావంత్‌, పంకజ్‌ ధీర్‌, ఆయన కుమారుడు నికితిన్‌ ధీర్‌, పునీత్‌ ఇస్సార్‌, రాజ్‌పాల్‌ యాదవ్‌, మిన్నిసా లాంబ, మహిమా చౌధురి, రోహిత్‌ రాయ్‌, అమన్‌ వర్మ, కోయినా మిత్రా, రాహుల్‌ భట్‌, గాయకులు దలేర్‌ మెహందీ, మికా, అభిజిత్‌ భట్టాచార్య,బాబా సెహ్‌గల్‌, నృత్య దర్శకుడు గణేశ్‌ ఆచార్య, హాస్య నటులు  రాజ్‌పాల్‌ యాదవ్‌, రాజు శ్రీవాస్తవ, కృష్ణ అభిషేక్‌, విజయ్‌ ఈశ్వర్‌లాల్‌ పవార్‌ తదితరులు ఉన్నారు. 

Last Updated 20, Feb 2019, 12:49 PM IST