హైపర్ ఆది రూ.2కోట్ల విలువైన పొలం కొన్నాడట!

Published : Nov 07, 2018, 11:23 AM IST
హైపర్ ఆది రూ.2కోట్ల విలువైన పొలం కొన్నాడట!

సారాంశం

'జబర్దస్త్' షోతో బుల్లితెరకి పరిచయమైన హైపర్ ఆది అతి తక్కువ సమయంలో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేసుకోవడం కోసం హైదరాబాద్ వచ్చిన హైపర్ ఆది వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి. 

హైదరాబాద్ లో జాబ్ కోసం ప్రయత్నిస్తోన్న రోజుల్లో సరదాగా చేసిన ఓ పేరడీ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ద్వారా అతడికి 'జబర్దస్త్'లో కామెడీ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టీమ్ లీడర్ అయ్యాడు. ఆ తరువాత సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి.

అతడి పంచ్ లకి, కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. త్వరలోనే పవన్ కల్యాణ్ 'జనసేన' పార్టీ తరఫున ప్రచారం కూడా చేస్తాడని టాక్. ఇదంతా పక్కన పెడితే.. హైపర్ ఆది రెండు కోట్ల విలువైన పొలం కొన్నాడని అతడి సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

జబర్దస్త్ షోతో అలానే సినిమాల్లో నటుడిగా బాగానే సంపాదించాడని, ఆ డబ్బుతోనే తన సొంత ఊళ్లో పొలం కొనుక్కున్నాడని తెలుస్తోంది. 

'జబర్దస్త్' నుండి హైపర్ ఆది ఔట్..?

PREV
click me!

Recommended Stories

రాజా సాబ్ గేమ్ ఓవర్.. 13వ రోజు ప్రభాస్ సినిమా షాకింగ్ వసూళ్లు
నాగార్జున యాక్టింగ్ పై సెటైర్లు వేసిన ఏఎన్నార్.. తండ్రే తనపై జోకులు వేయడంతో ఏం చేశాడో తెలుసా ?