Samantha : వెరీ బ్యూటిఫుల్.. వైరల్ అవుతున్న సమంత కొత్త పిక్

Published : May 03, 2022, 08:33 AM IST
Samantha : వెరీ బ్యూటిఫుల్.. వైరల్ అవుతున్న సమంత కొత్త పిక్

సారాంశం

ఇటీవల సమంత సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ లో సమంతకు ఉన్న క్రేజ్ అలాంటిది. 

నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా నటించేందుకు సామ్ రెడీ అవుతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయింది. క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి సరైన స్పందన రాలేదు. 

తన పని తాను చేసింది కాబట్టి సామ్ కూడా ఈ చిత్రాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. సమంత నటించిన అసలైన చిత్రాలు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. పాన్ ఇండియా మూవీ 'యశోద' ఆగస్టులో రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే పౌరాణిక చిత్రం శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 

ఇటీవల సమంత సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ లో సమంతకు ఉన్న క్రేజ్ అలాంటిది. తాజాగా సమంత వైట్ ఫ్లవర్స్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో షేర్ చేసింది. వయసు పెరిగే కొద్దీ ఆలోచన స్థాయి కూడా పెరుగుతోంది అని అర్థం వచ్చేలా సామ్ ఈ పిక్ కి కామెంట్ పెట్టింది. 

సమంత షేర్ చేసిన ఈ పిక్ చాలా అందంగా ఉంది. దీనితో సామ్ ఫ్యాన్స్ కామెంట్స్ మోత మోగిస్తున్నారు. 24 గంటలు గడవక ముందే ఈ పోస్ట్ కి మిలియన్ కి పైగా లైక్స్ వచ్చాయి. ఇటీవల సమంత తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంది. తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కి సంబంధించిన పిక్ అని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ ఫోటోకి హీరోయిన్ కావ్య థాపర్, స్టైలిస్ట్ ప్రీతం లాంటి సెలెబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. 

 

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే